OTT Movie : భార్య భర్తల స్టోరీ లతో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని చూస్తున్నప్పుడు నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భార్య తన కుటుంబాన్ని ఎక్కువగా కంట్రోల్ లో పెడుతుంటుంది. తనకు తానుగా ప్రతిదీ గీత గీసుకొని కూర్చుంటుంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఆ తర్వాత స్టొరీ మరో మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘హోమ్ స్వీట్ హెల్’ (Home Sweet Hell). 2015 లో వచ్చిన ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీకి ఆంథోనీ బర్న్స్ దర్శకత్వం వహించాడు. ఇందులో కేథరీన్ హేగల్, పాట్రిక్ విల్సన్, జోర్డానా బ్రూస్టర్, కెవిన్ మెక్‌కిడ్, A. J. బక్లీ, చి మెక్‌బ్రైడ్ జిమ్ బెలూషి నటించారు. ఈ మూవీ స్టోరీ డాన్ షాంపెయిన్ అనే వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డాన్ ఒక ఫర్నిచర్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తుంటాడు. ఇతనికి మోనా అనే అందమైన భార్య ఉంటుంది. ఆమె తన కుటుంబాన్ని అతిగా నియంత్రిస్తూ ఉంటుంది. ప్రతి దానికిరూల్స్ పెట్టి ఒక మిషిన్ లా ఉంటుంది. భార్య ప్రవర్తనతో విసుకు చెందిన భర్త తన ఫర్నిచర్ షాప్ లో పనిచేసే సేల్స్ గర్ల్ డష్టి తో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. భర్త బాగా సంతోషంగా ఉండటంతో, భార్య కూడా తన కుటుంబం పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటుంది. అయితే డష్టితో రొమాన్స్ వల్లే భర్త సంతోషంగా ఉంటాడు. ఒకరోజు డష్టి తను ప్రెగ్నెంట్ అని డాన్ కి చెప్తుంది. అప్పటినుంచి డాన్ ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకుంటుంది. ఆ తర్వాత టెన్షన్ తట్టుకోలేక ఈ విషయం భార్యకి చెప్తాడు.
ఈ సమస్య నుంచి బయట పడాలంటే డష్టి ని చంపేయాలనుకుంటుంది మోనా. భర్తతో కలసి ప్లాన్ చేస్తుంది. ఆమెను మత్తులో వెళ్లే విధంగా చేస్తాడు డాన్. ఆ తర్వాత మోనా ఆమెను సుత్తితో కొట్టి చంపేస్తుంది. ఇది చూసి డాన్ చాలా బాధపడతాడు. ఆమెను చంపి ముక్కలు చేసి పాతిపెట్టేటప్పుడు, డష్టి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకుంటుంది మోనా. ఆ తర్వాత మోనా సైకో వేషాలకి భర్తకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. చివరికి ఆ హత్యతోనే కథ ముగుస్తుందా? భార్య భర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటారా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హోమ్ స్వీట్ హెల్’ (Home Sweet Hell) అనే ఈ మూవీని చూడండి.