E-Paper
Advertisement

OTT Movie : ప్రియురాలి కోసం పెళ్ళాన్ని బలి చేసే మొగుడు… మామ ఇచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్

OTT Movie : ప్రియురాలి కోసం పెళ్ళాన్ని బలి చేసే మొగుడు… మామ ఇచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie: మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలో వీటిని వదలకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, తహసీల్దార్ భార్య ఒక యాక్సిడెంట్ లో చనిపోతుంది. అయితే ఆ ప్రమాదం వెనుక ఒక మిస్టరీ ఉంటుంది. ఆ మిస్టరీ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

సోనీలివ్ (Sony liv)

Advertisement

ఈ మలయాళ థ్రిల్లర్ మూవీ పేరు’కానెక్కానె’ (Kaanekkaane). 2021లో విడుదలైన ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి మను అశోకన్ దర్శకత్వం వాహంచాడు. బాబీ, సంజయ్ ఈ మూవీని రచించారు. ఇందులో సురాజ్ వెంజరమూడు, టోవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి, శృతి రామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ పాల్ మాథ్యూ అనే డిప్యూటీ తహసీల్దార్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా సోనీలివ్ (Sonyliv) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

మాథ్యూ డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతని కుమార్తె షెరిన్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది.షెరిన్ భర్త అలెన్ ఆమె మరణం తర్వాత స్నేహని వివాహం చేసుకుంటాడు. అలెన్ కు షెరిన్‌కి పుట్టిన కుట్టు అనే ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఇతన్ని స్నేహ తన సొంత కొడుకులా చూసుకుంటుంది.షెరిన్ మరణించి ఒక సంవత్సరం తర్వాత, పాల్ తన మనవడు కుట్టుని చూడటానికి అలెన్ ఇంటికి వస్తాడు. ఇతడు షెరిన్ కు తండ్రి గా ఉంటాడు. అక్కడ అతను అలెన్, స్నేహ జీవితంలో సంతోషంగా కనిపిస్తున్న దృశ్యాలను చూసి కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతాడు. అయితే అతని సందర్శన సమయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతాయి. ముఖ్యంగా షెరిన్ మరణం వెనుక ఉన్న నిజం గురించి. పాల్ ఈ విషయాన్ని లోతుగా విచారించడం ప్రారంభిస్తాడు.

ఒకరోజు షెరిన్ మరణానికి సంబంధించిన నిజం వెల్లడవుతుంది. అలెన్, స్నేహ మధ్య సంబంధం షెరిన్ బ్రతికి ఉన్నప్పుడే ప్రారంభమైందని, ఆమె మరణం ఒక సాధారణ ప్రమాదం కాకపోవచ్చని పాల్‌కి తెలుస్తుంది. అలెన్ తన భార్య షెరిన్‌ని రోడ్డుపై గాయపడి పడి ఉన్నప్పుడు చూసినప్పటికీ, స్నేహతో ఉన్న సంబంధం కారణంగా ఆమెను కాపాడకుండా వెళ్లిపోతాడు. ఈ నిజం తెలిసిన పాల్, న్యాయం కోసం పోరాడాలా లేక క్షమించాలా అనే సంఘర్షణలో పడతాడు. పాల్ తన కుమార్తె కోసం న్యాయం కోరుకుంటాడు, అలెన్ తాను తప్పు చేశానని, అపరాధ భావనతో బాధ పడతాడు.స్నేహ ఈ పరిస్థితుల్లో ఇద్దరితో సమతుల్యత కోసం ప్రయత్నిస్తుంది. చివరికి పాల్ అలెన్‌ని క్షమిస్తాడా? స్నేహను కూడా కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తాడా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, సోనీలివ్ (Sonyliv) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కానెక్కానె’ (Kaanekkaane)  అనే ఈ మలయాళ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×