BigTV English

Kitchen Tips: రాత్రి పూట గిన్నెలు క్లీన్ చేయకుండా సింక్‌లోనే వదిలేస్తున్నారా ? జాగ్రత్త..

Kitchen Tips: రాత్రి పూట గిన్నెలు క్లీన్ చేయకుండా సింక్‌లోనే వదిలేస్తున్నారా ? జాగ్రత్త..

Dirty Dishes In Kitchen Sink: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో వివిధ రకాల పనులు, ఉద్యోగాల వల్ల పంట చేసుకొని తినేందుకు కూడా చాలా మందికి తీరిక ఉండటం లేదు. అలాంటి వారు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. కానీ కొంత మంది ఇంట్లో వంట చేసుకుని తిన్నా కూడా సమయం లేదని వండటానికి వాడిన, తిన్న ప్లేట్లను భోజనాలు అయిన తర్వాత గంటల తరబడి సింక్‌లోనే వదిలేస్తుంటారు.


రాత్రి సమయాల్లోనూ వంట పాత్రలను శుభ్రం చేయకుండా సింక్‌లో వదిలేస్తుంటారు. ఇలా వదిలేసిన పాత్రలను ఆ మరుసటి రోజు పొద్దున శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శుభ్రం చేయని గిన్నెలను సింక్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని అంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా వండిన గిన్నెలు, తిన్న ప్లేట్లలో కొంత ఆహారం ఉండిపోతుంది. వాటిని భోజనాలు ముగిసిన తర్వాత సింగులో పడేస్తుంటారు. దీంతో రాత్రంతా గిన్నెలు శుభ్రం చేయకుండా ఉంచడం వల్ల బ్యాక్టీరియా ఎదగడానికి కావాల్సిన సమయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా పెరిగిన బ్యాక్టీరియా సింక్‌లోనే ఉండకుండా వంటగదిలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోందని అంటున్నారు. వంటగిన్నెలు, ఆహారపదార్థాల పైన కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.


ఉదయాన్నే శుభ్రం చేసినా..
రాత్రి సింక్‌లో ఉంచిన పాత్రలను ఉదయం క్లీన్ చేసుకోవడం వల్ల అన్నీ శుభ్రంగా క్లీన్ అయ్యాయని భావిస్తుంటారు. ఎలాగూ డిష్ వాష్ లిక్విడ్, లేదా సబ్బు ఉపయోగించాం మురికి అంతా పోయింది అని అనుకుంటారు. కానీ వంట గదిలోని సింక్, పాత్రలపై ఉన్న బాక్టీరియా అప్పటికే వంట గదిలో పూర్తిగా విస్తరిస్తుంది. ఈ విషయం తెలియకుండా కిచెన్‌లోని వస్తువులన్నీ మాములుగానే ఉదయం వంట కోసం ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు:
వంట గదిలో ఈ విధంగా వ్యాపించిన బ్యాక్టీరియా ద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే రాత్రి వేళలో పాత్రలన్నీ శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఎప్పటికప్పుడు గిన్నెల్ని శుభ్ర పరచడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వంట గది కూడా శుభ్రంగా ఉంటుంది.

రాత్రిపూట గిన్నెలను సింక్ లో ఉంచడం వల్ల ఈకోలి వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. రాత్రి పూట ఇంటి సింక్ లో తయారయ్యే ఈ బ్యాక్టీరియా వంటగది అంతా వ్యాపించి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

Also Read: ఈ వేర్లతో కషాయం చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయి

టైమ్ లేదనో.. అలసిపోయామనో.. ఇంకేదైనా కారణాల చేతనో రాత్రిపూట గిన్నెలు శుభ్రం చేయకుండా ఉండకండి. వంట పాత్రలు శుభ్రం చేయడానికి వీలు కాకపోతే కనీసం అందులో ఉన్న ఆహార పదార్థాలను క్లీన్ చేసి డస్ట్ బిన్‌లో పాడేయండి. కొంత మేరకు బ్యాక్టీరియా వ్యాప్తిని ఇలా అరికట్టవచ్చు. ఇలా చేస్తే మరుసటి రోజు పాత్రను శుభ్రంగా కడిగి కాసేపు వేడి నీటిలో ఉంచి , ఆ తర్వాత వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×