BigTV English

Moles Meanings: అక్కడ పుట్టమచ్చ ఉందా? చచ్చేలోపు కోటీశ్వరులు అయిపోతారు!

Moles Meanings: అక్కడ పుట్టమచ్చ ఉందా? చచ్చేలోపు కోటీశ్వరులు అయిపోతారు!

పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న కొన్ని పుట్టుమచ్చలు ఆ వ్యక్తికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. సకల సుఖాలను అందిస్తాయి. ఆర్థిక వృద్ధిని ఇస్తాయి. శరీర భాగాల నిర్మాణం పై ఉన్న పుట్టుమచ్చలను సాముద్రిక శాస్త్రం వివరిస్తోంది. వీటి ద్వారా ఆ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయచ్చని, వారి భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితిని ముందే ఊహించి చెప్పవచ్చని అంటారు.


శరీరంలోని వివిధ భాగాలపై ఉన్న పుట్టుమచ్చలు ఏం చెబుతాయో ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడిగా మారుతాడో తెలుసుకుందాం.

నుదుటికి కుడివైపున
సాముద్రిక శాస్త్రం చెబుతున్న ప్రకారం నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉండటం ఎంతో శుభప్రదం. అలాంటి వ్యక్తి తెలివైనవాడుగా మారుతాడు. అలాగే డబ్బును అధికంగా సంపాదిస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకు ఎప్పుడు కొరత రాదు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే చేస్తారు.


నాభి దగ్గర
పొట్టపై ఉన్న నాభి మీద లేదా నాభికి దగ్గరలో పుట్టుమచ్చ ఉండడం అదృష్టాన్ని సూచిస్తుంది. అలాంటి వ్యక్తికి చిన్న వయసులోనే ఎంతో సంపద కలుగుతుంది. కీర్తిని కూడా మూటకట్టుకుంటాడు. నాభి పక్కన పుట్టుమచ్చ వున్న వ్యక్తి పేద కుటుంబంలో జన్మించినప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు.

ఛాతీ మధ్యలో
చాతి మధ్యలో పుట్టుమచ్చ వున్న వ్యక్తి కూడా చాలా అదృష్టవంతుడు. అతనికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. ఆ వ్యక్తి జీవితమంతా ఒకే శైలిలో ఆనందంగా జీవిస్తాడు. అతనికి ఎన్నో కొత్త పదవులు, గౌరవాలు దక్కుతాయి. అతనికి ఎప్పుడు కూడా డబ్బుకు కొరత ఉండదు. ఎంతో సంతోషంగా జీవించేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

ముక్కు మీద పుట్టుమచ్చ
ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తికి విపరీతమైన కోపం వస్తుందట. అయితే అలాగే పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చిపెడుతుందట. చాలా తక్కువ సమయంలోనే వీరు అనంతమైన పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారట.

పెదవులపై పుట్టుమచ్చ
పెదవులపై పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు ఎంతో అదృష్టవంతులు, జ్ఞానవంతులుగా మారుతారు. ఎంతో చదువును సంపాదిస్తారు. గురువులుగా మంచి గౌరవాన్ని అందుకుంటారు. నిత్యం అధ్యయనంలో మునిగి తేలుతారు. వారికి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×