Uses of sprout:రోజూ ఉదయం మెులకలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని అన్ని కావు. శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు దాడి చేసే ప్రమాదం ఉంది. మన శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందాలంటే రోజూ కాసిన్ని మెులకలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మెులకలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నగా ఉండవచ్చు. కాని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగాపడుతుంది.
వెయిట్ లాస్..
మీరు బరువు తగ్గాలనుకుంటే మెులకెత్తిన గింజలను తినడం చాలా మంచిది. సాధారణంగా బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు, కూరగాయాలు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాల అంకురోత్పత్తి నుంచి మెులకలు లభిస్తాయి. ఇవి విటమిన్లు, మినరల్స్ తో నిండి ఉన్న మంచి పోషకాహారం. వీటిని తినడం వల్ల జీర్ఱశక్తి పెరుగుతుంది. మెులకల్లో జింక్, ఇనుముచ క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సక్రమంగా సరఫరా చేస్తాయి. ముఖ్యంగా జింక్ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
మెులకల్లో ఉండే పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే ఈ పోషకాలు హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుందని, అంతేకాకుండా గుండె సమస్యల్ని తగ్గిస్తుందిన చెప్తున్నారు. మెదడుకు రక్తం చక్కగా సరఫరా చేయడంలోనూ మొలకల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడేవారు… మొలకల్ని తీసుకోవడం మంచిది. వీటిల్లో దొరికే మెగ్నీషియం, క్యాల్షియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది:
మెులకలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ సమస్యతో పోరాడే వారు డైట్‌లో మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలా అని సాయంత్రం సమయంలో తింటే జీర్ణం కావడం కష్టం అవుతుంది. కావున విలైనంత వరకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిదని అంటున్నారు.
Also Read: హాలో.. మీకు తెలుసా? వేసవిలో తప్పకుండా తినాల్సిన కూర ఇదే
రోగనిరోధక శక్తిని పెరుగుతుంది:
మెులకెత్తన గింజలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడతాయి. స్త్రీలలో పీరియడ్స్ సమస్య, సంతాన సమస్య ఉన్నవారికి, అలాగే హార్మోన్ అసమతుల్యతతో బాధపడేవారికి మెులకలను క్రమం తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.