Russia Earthquake: రష్యాలోని కమ్చట్కా తీరప్రాంతాన్ని బుధవారం ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రత గా నమోదు అయ్యింది. ప్రపంచంలో వచ్చిన భూకంపాలతో పోల్చితే 14 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే రష్యాలో అయితే 73 ఏళ్ల తర్వాత వచ్చిందని అంటున్నారు. రింగ్స్ ఆఫ్ ఫైర్‌ను నిజమైన విలన్‌గా పిలుస్తున్నారు.
రష్యాలో 1952 తర్వాత కమ్చట్కా ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటి. ప్రకంపనలు కాకుండా జపాన్, పసిఫిక్ తీరం వెంబడి ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పును పెంచింది. బుధవారం వచ్చిన భూకంపం 1952 తర్వాత అత్యంత శక్తివంతమైనదని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వీస్ కమ్చట్కా శాఖ తెలిపింది.
తీరం వెంబడి ప్రమాదకరమైన సునామీ అలలు ఎగసిపడ్డాయని పేర్కొంది. ఘటన తీవ్రతను బట్టి పరిశీలిస్తే.. రానున్న ప్రకంపనలు 7.5 తీవ్రతతో వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అయితే ప్రకంపనలు కనీసం ఒక నెల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని జియోఫిజికల్ సర్వీస్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఓ ప్రకటనలో తెలియజేసింది.
రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో కీలకమైన ప్రాంతం. దాని చుట్టూ విస్తారించి ఉంటాయి. దీన్ని భూకంప గొలుసుగా వర్ణిస్తుంటారు. అందుకే దీనికి రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తారు. ఈ ఏరియాలో భారీగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూకంపాలు- అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచుగా సంభవిస్తాయి.
ALSO READ: రష్యా, జపాన్‌లను తాకిన సునామీ..
భూమి యొక్క లిథోస్పిరిక్ ప్లేట్ల కదలిక, ఢీకొన్న ఫలితంగా ఇలాంటివి సంభవిస్తాయి. వివిధ టెక్టోనిక్ ప్లేట్ల అంచుల వెంట గొలుసు మాదిరిగా విస్తరించి ఉంటుంది. దక్షిణ అమెరికా చివరి నుండి న్యూజిలాండ్ వరకు అంటే దాదాపు 40,000 కిలోమీటర్లు (25,000 మైళ్ళు) విస్తరించాయి. ప్రపంచంలో దాదాపు 90 శాతం భూకంపాలు ఈ ప్రాంతంలో వస్తుంటాయి.
భూమిపై క్రియాశీల అగ్నిపర్వతాలలో 75 శాతం ఈ ప్రాంతంలో ఉన్నాయి కూడా. ఈ లెక్కన 452 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సరిహద్దులో బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా ఖండం ఉంది.
🚨 BREAKING:
A kindergarten in Russia's Far East was damaged following a massive 8.8 magnitude earthquake off the Kamchatka Peninsula.#Russia #Earthquake #Kamchatka pic.twitter.com/y3aDLiXnxQ— Siddharth (@Siddharth_00001) July 30, 2025