E-Paper
Advertisement

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. దేశభక్తిని చాటే అద్భుతమైన కోట్స్

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. దేశభక్తిని చాటే అద్భుతమైన కోట్స్
Advertisement

Independence Day wishes: ప్రతి భారతీయుడి గుండెల్లో దేశ భక్తి ఉప్పొంగే రోజు స్వాతంత్ర్య దినోత్సవం. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. ఈ మహోత్సవ రోజున మన దేశం పట్ల గౌరవాన్ని చాటుతూ..  ప్రియమైన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయడం మన బాధ్యత.  ఇందుకోసం ప్రత్యేకమైన కోటేషన్స్..

20 అద్భుతమైన కొటేషన్స్:

1.శత్రువులతో పోరాడి ప్రాణాలర్పించిన సైనికుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది.
ఆ వీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే మన అసలైన బాధ్యత. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!”

Advertisement

2. ఎందరో మహానుభావుల రక్తతర్పణం వల్ల దక్కిన ఈ స్వేచ్ఛా వాయువులను వృథా చేయకుండా,
శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి మన సత్తా చాటుదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

3. దేశం కోసం అమరులైన వారి ఆత్మలకు శాంతి కలగాలంటే.. ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలి.
త్యాగధనుల స్మృతే మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం కావాలి. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!”

Advertisement

4.ప్రాణాలను సైతం లెక్కచేయని వీరుల సాహసం మనకు తెగువను నేర్పుతుంది.
ఆ ధైర్యంతోనే ప్రతి రంగంలోనూ కొత్త విజయాలను సాధిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి.హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

5. చరిత్రలో వీరుల త్యాగాలు అక్షరాలై నిలిస్తే, వర్తమానంలో మన శ్రమ దేశ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది.
భారతమాత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తం చేద్దాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

6. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తిగా తీర్చిదిద్దాలి.
అదే మన దేశ భక్తికి అసలైన నిర్వచనం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

7.  అమరుల రక్తంతో తడిసిన ఈ పవిత్ర భూమిని అభివృద్ధిలోనూ అగ్ర స్థానంలో నిలపాలి.
దేశ సర్వతోముఖాభివృద్ధే ప్రతి భారతీయుడి ప్రథమ కర్తవ్యం కావాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

8. జాతి కోసం ప్రాణాలర్పించిన వారి ఆశయం ఒక్కటే – దేశం ఎప్పుడూ సమున్నతంగా ఉండాలి.
ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి నిరంతరం శ్రమిద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

9. మన జాతీయ జెండా గాలిలో సగర్వంగా ఎగరాలంటే, సరిహద్దుల్లో జవాన్ల పహారా ఎంత అవసరమో,
దేశం ముందుకు సాగడానికి మన ఐక్యత అంతే ముఖ్యం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

10.ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం..ఈ పవిత్రమైన రోజున అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

11.స్వేచ్ఛ అనేది మన జన్మహక్కు, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

12. మన జాతీయ జెండా ఎప్పుడూ గగనంలో ఎగరాలని, మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం కావాలని కోరుకుందాం.హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

13.జాతి, కుల భేదాలు మరిచి భారతీయులుగా ఏకమై ముందుకు సాగుదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

14.స్వాతంత్ర్యం తెచ్చిన వీరులను స్మరించుకుంటూ.. దేశాభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలు!

15.స్వేచ్ఛా వాయువులు పీల్చే అదృష్టం మనకు కల్పించిన ప్రతి సైనికుడికి, వీరుడికి నమస్కరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

Related News

ఫ్రిజ్‌లో పెట్టిన పిండి వాడకూడదా? నిపుణులు ఏం చెబుతున్నాంటే?

ఆగస్ట్ 15 ఇంటి డెకరేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మంచి భర్త అంటే డబ్బులు సంపాదించేవాడు కాదు.. ఇవి ఉన్నవాడే!

ఉదయం 5 గంటలకు లేస్తే నిజంగానే లైఫ్ మారుతుందా?

కేవలం మాటలతోనే ఇతరులను ఆకట్టుకుంటారు.. ఈ రాశుల్లో పుట్టినవారు సూపర్ పర్సనాలటీ

అమ్మాయిలు ప్రేమలో పడితే మొదట చేసే పని ఇదే!

రాత్రి ఎంతసేపు పడుకున్నా అలసటగా అనిపిస్తోందా? మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్న ఆ చిన్న తప్పు ఇదే!

Big Stories

Advertisement
×