Tips For Glowing Skin: అందమైన ముఖానికి చక్కని చిట్కాలు.. మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఎలాంటి ముఖం అయినా తెల్లగా మారాల్సిందే.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకు కావాల్సిన పదార్ధాలు
-రోజ్ పౌడర్
-బీట్ రూట్ పౌడర్
-ఆరెంజ్ పీల్ పౌడర్
-ముల్తానీ మిట్టి
-మిల్క్
-రోజ్ వాటర్
-గంధం పొడి
తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, టేబుల్ స్పూన్ గంధం పొడి, టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, అర కప్పు పాలు లేదా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే అందమైవ మోము మీ సొంతం అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే ముఖం తాజాగా, అందంగా కనిపిస్తుంది.
అలోవెరా జెల్, శెనగపిండి, ఆలివ్ ఆయిల్, పాలు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో టేబుల్ స్పూన్ శెనగపిండి, అలోవెరా జెల్, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పచ్చిపాలు, అందులో విటమిన్ సి ట్యాబ్‌లెట్ తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు, మృతకణాలు, మొంగు మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా, తాజాగా మెరుస్తుంది.
వేప, పుదీనా రసం ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పుదీనా రసం, వేప ఆకుల రసం తీసుకుని.. అందులో చిటికెడు కొబ్బరి నూనె కలిపి ముఖానికి పెట్టుకుని.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు తొలగిపోయి అందంగా కనపిస్తారు.
పెరుగు, పసుపు, కొబ్బరి నూనె ఫేస్ మాస్క్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కొబ్బరి నూనె, చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని కొంచెం సేపు మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఫేస్ కూడా తాజాగా కాంతివంతంగా మెరుస్తుంది.
Also Read: చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వస్తుందా? మీ సమస్యకు ఇదిగో పరిష్కారం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.