Weight Loss Tips: బరువు తగ్గాలంటే కఠినమైన డైట్లు పాటించడంతో పాటు గంటల తరబడి వ్యాయామం చేయాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో ఏకంగా 32 కేజీల బరువు తగ్గి చూపించింది ప్రముఖ కంటెంట్ క్రియేటర్ దీప్తి. 92 కేజీల నుంచి 60 కేజీలకు చేరుకున్న ఆమె.. కేలరీలను బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు, రోజూ తినే కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెబుతోంది. ముఖ్యంగా ఈ 5 రకాల ఫుడ్స్‌ను పక్కన పెట్టడమే తన వెయిట్ లాస్ జర్నీలో కీలక మార్పుగా మారిందని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇంతకీ దీప్తి దూరం పెట్టిన ఆ ఐదు ఆహారాలు ఏంటి? బరువు తగ్గేందుకు ఆమె పాటించిన ఇతర నియమాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ తాగే తీపి పానీయాలు, సోడాల వల్ల శరీరంలో అనవసరంగా కేలరీలు, కొవ్వు పెరిగిపోతాయి. అందుకే దీప్తి వీటిని పూర్తిగా దూరం పెట్టింది. వీటి స్థానంలో రోజూ నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ వంటి సహజ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంది. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా.. ముఖంపై వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read: బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
మైదాతో చేసే వైట్ బ్రెడ్ వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే వైట్ బ్రెడ్ స్థానంలో మల్టీగ్రేన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్ వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఆమె ఎంచుకుంది. ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి, త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి.
కిరాణా కొట్టులో దొరికే చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ఉప్పు, నూనె పరిమాణం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడం అసాధ్యం. అందుకే దీప్తి బయటి తిళ్లను మానేసి గుప్పెడు వేయించిన శనగలు, పూల్ మఖానా, డ్రై ఫ్రూట్స్ తినడం ప్రారంభించింది. ఇవి ఆరోగ్యానికి మంచివి, అదే సమయంలో స్నాక్స్ తినాలనే కోరికను తీరుస్తాయి.
బర్గుర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేపుళ్లను పూర్తిగా పక్కన పెట్టి, ఇంట్లోనే చేసుకునే పనీర్ తిక్కా, చికెన్ తిక్కా, రోటీ రోల్స్‌ను తిన్నది. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఆలస్యంగా తినే అలవాటును పూర్తిగా మానేసింది. రాత్రి ఆకలేస్తే మూలికా టీ తాగడం లేదా త్వరగా నిద్రపోవడం చేసింది. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగుతూ.. 7 గంటల నిద్ర, క్రమం తప్పకుండా వాకింగ్ చేయడమే తన ఈ మార్పుకు అసలు కారణమని ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పష్టం చేసింది.
Also Read: ఇంట్లో ఈ దిశను ఖాళీగా ఉంచితేనే లక్ష్మీదేవి కొలువుంటుందా? వాస్తు ఏం చెబుతోంది?