E-Paper
Advertisement

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!
Advertisement

Rashmika -Vijay Devarakonda: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ జంటగా నటించిన తాజా చిత్రం రణబాలి(Ranabaali). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఈ జంట పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మిక(Rashmika) నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక విజయ్ దేవరకొండ తమ వ్యక్తిగత విషయాలు గురించి కూడా సరదాగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ కు సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు..

ఇందులో భాగంగానే సుధీర్ శ్రీనివాసన్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో విజయ్ రష్మిక పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక తమ వ్యక్తిగత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా విజయ్ దేవరకొండలో తనుకు నచ్చని విషయం గురించి కూడా తెలియజేశారు. తాను ఏ చిన్న వేడుక అయిన సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను కానీ విజయ్ దేవరకొండ మాత్రం అలా ఇష్టపడరని తెలిపారు. బర్త్డే, యానివర్సరీ , మంత్ వర్సరీ ఇలాంటి ప్రత్యేకమైన రోజులను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వ్యక్తి విజయ్ కాదని ఈ విషయం తనకు ఏమాత్రం నచ్చదని తెలిపారు.

నా జీవితంలోకి సెలబ్రేషన్ ను తీసుకువచ్చింది రష్మికనే ..

Advertisement

విజయ్ దేవరకొండ తనని ఉద్దేశించి ఇటీవల చేసిన ఓ కామెంట్ మాత్రం తనకు చాలా బాగా నచ్చుతుందని తెలిపారు. నా జీవితంలోకి సెలబ్రేషన్ ను తీసుకువచ్చింది రష్మికనే అంటూ తను చెప్పిన కామెంట్స్ మాత్రం తనకు బాగా నచ్చాయని రష్మిక తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ తన ఇష్టాలకు పూర్తిగా భిన్నంగా ఉంటారని తెలిపారు. తనకు ఎక్కువగా హిస్టరీ, లాజిక్, సైన్స్ గురించి బాగా ఆసక్తి ఉంటుంది వాటి గురించి ఆలోచిస్తారు కానీ తాను మాత్రం భావోద్వేగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఇలా విజయ్ దేవరకొండలో నచ్చని విషయాల గురించి, విజయ్ ఇష్టాయిష్టాల గురించి రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సింగనమల బొబ్బిలి రణబాలి..

ఇక రణబాలి సినిమా విషయానికి వస్తే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించగా విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.మరి అక్టోబర్ 16న రాబోతున్న రణబాలి విజయ్ రష్మికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

Related News

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా.. ఎంతమంది వారసులంటే?

రష్మిక రణబాలి ఒకే చేయడానికి అతనే కారణమా? విజయ్ మాత్రం కాదండోయ్!

సీరియల్‌లో రూ.750తో మొదలు.. ఇప్పుడు కోట్లలో పారితోషికం! రచితా రామ్ జర్నీ ఇదే

‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

Big Stories

Advertisement
×