Singeetham Pushpaka Vimanam:సింగీతం శ్రీనివాసరావు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చే చిత్రం పుష్పక విమానం. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి నిడివి మాటలు లేని చిత్రంగా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivas Rao) రచన, దర్శకత్వంలో శృంగార్ నాగరాజుతో కలిసి ఆయన సహా నిర్మాతగా కూడా దీనికి వ్యవహరించారు. కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించగా, అమల హీరోయిన్ గా, సమీర్ ఖఖర్, టిను, ఆనంద్, కేఎస్ రమేష్, ప్రతాప్ పోతన, లోకనాథ్, పి ఎల్ నారాయణ లాంటి ఎంతోమంది దిగ్గజాలు ఇందులో నటించారు. ఒక నిరుద్యోగ పట్టభద్రుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
డైలాగ్ లెస్ డ్రామాగా 1987 నవంబర్ 27న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే తెలుగు, కన్నడ ,తమిళ్, హిందీ, మలయాళం భాషలలో విడుదల అయ్యి, ప్రశంసలు అందుకుంది. బెంగళూరులో 35 వారాలపాటు థియేటర్లలో ప్రదర్శించబడి, కమర్షియల్ సక్సెస్ అందుకుంది. 35వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ కన్నడ విభాగంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులను కూడా గెలుచుకుంది.
ఇకపోతే పుష్పక విమానం చేయడం గురించి ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఏ సినిమా చేయాలన్నా లేదా ఏ పని చేయాలన్నా ప్రతి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను. అయితే ఈ సినిమా చేయాలనే పట్టుదల నాలో ఎప్పుడు మొదలైందంటే.. కె.వి.రెడ్డి గారు, పెంగళ నాగేంద్ర.. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం..అందులో ఒక సీన్ హీరో, హీరో కమెడియన్ ఫ్రెండ్ రామారావు గారు , రేలంగి ఒక గుహలో నుంచి వెళ్తున్నారు. అలా వెళ్తుంటే.. పింగళి నాగేంద్ర ఒక డైలాగు రాశారు. “మిత్రమా.. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. నాకు భయంగా ఉంది ” అని రాసారు.
కేవీ రెడ్డి గారు ఇది చూసి ఏంటి నాగేంద్ర ఇలా రాశారు అని అడిగారు. కేవీ రెడ్డి గారికి చీకటి అంటే.. చీ క టీ అని చూపించాలి. భయం అంటే ఎక్స్ప్రెషన్ విజువల్ గా చూపించాలి. డైలాగు చెప్పాలి అంటే అందులో విజువల్ కనిపించాలి అని కె.వి రెడ్డి గారు చెప్పారు.దానికి నాగేంద్ర కరెక్టే సార్.. నాకు తెలియక కాదు. కానీ మీరు ఎటువంటి కెమెరామెన్ పెట్టుకుంటారో.. ఎటువంటి డైలాగు యాక్టర్ ని పెట్టుకుంటారో.. మీరు ఎంత దేదీప్యమానంగా చేసినా.. ఇక్కడంతా చీకటిగా ఉందని డైలాగ్ చెప్తే.. జనం ఓ ఇదంతా చీకటి అనుకుంటారు. డైలాగ్ లో నాకు భయంగా ఉందంటే.. అతని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏం పలకపోయినా.. అతనికి భయంగా ఉంది అనుకుంటారు. అందుకే నేను సులభం చేశాను. మంచి యాక్టర్ , మంచి కెమెరామెన్ దొరికితే అది ఎందుకు అన్నాడు.
అప్పుడు నాకు అర్థమైంది.. డైలాగ్ లేకుండా ఉంటే ప్రతిభ.. డైలాగ్ తో చెప్పడం అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాకపోయినా.. డైలాగ్ తో చెప్పేయవచ్చు. కథ చెప్పేయొచ్చు . విజువల్ గా కథ మొత్తం చెప్పొచ్చు.. కానీ డైలాగ్ లేకుండా కథ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది? అనే ఆలోచన.. అప్పుడు ఈ పుష్పక విమానం కథకి బీజం పడింది.
అయితే ఆ తర్వాత కమలహాసన్ కి కథ చెప్పితే ఆయన నటుడిగా నటించడానికి ఆసక్తి చూపించారు. అయితే నిర్మాతగా పెట్టుబడి పెట్టడానికి సమర్ధుడే అయినా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత శృంగార్ నాగరాజు అనే ఒక వ్యక్తి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన మరో సినిమా చేయలేదు. ఈ సినిమాను నిర్మించడానికే ఆయన పుట్టాడా అన్నట్టు వచ్చాడు నిర్మించారు.
also read:ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?
అయితే ఇది మూకీ సినిమా కాదు.. చార్లీ చాప్లిన్ వాళ్ళు మూకీ సినిమా చేసినా టైటిల్స్ వేసేవాళ్ళు. ఇది డైలాగులు లేని సినిమా.. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇది డైలాగ్ లేని సినిమా అప్పట్లో ఛాలెంజింగ్ తీసుకొని ఈ చిత్రం నిర్మించడం జరిగింది “అంటూ తెలిపారు.
ముఖ్యంగా ఈ సినిమాలో మాటలు లేని కారణంగా శ్రీనివాసరావు ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి నటులను ఎంచుకున్నారు. తమిళనాడుకు చెందిన కమలహాసన్ ను ప్రధాన పాత్రధారిగా ఎంచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ కి చెందిన నీలం కోటారి ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ చిత్రాలలో లాగా మెరిసే దుస్తులు కావాలని కోరింది. దీంతో ఆమెను తీసుకోలేదు. దాంతో మద్రాస్ లో ఒక అవార్డుల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమలను చూసి ఆమెను ఎంచుకున్నారు. హిందీ టెలివిజన్ ధారావాహిక నుక్కడ్ లోని తాగుబోతు పాత్ర నుండి ప్రేరణ పొంది తాగుబోతు ధనవంతుడిగా సమీర్ ఖఖర్ ను తీసుకున్నారు. కర్ణాటక నుండి కే ఎస్ రమేష్ ను ఎంచుకున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రం నుండి ఒక్కో నటులను ఇందులో భాగం చేశారు.