Instant skin Glow: ముఖ సౌందర్యం కోసం ఆడవారు, మగవారు.. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందంగా కనిపించాలని, చర్మాన్ని మెరుగుపరుచుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అలాగే పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ చేపిస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. ఫ్యూచర్‌లో అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా పాటించండి. తక్షణమే చర్మ నిగారింపు మీ సొంతం అవుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్-1
ముందుగా చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.
స్టెప్ -2
అలోవెరా జెల్‌ను ముఖంపై అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ముఖం చాలా సాఫ్ట్‌గా, కాంతివంతంగా మారుతుంది.
స్టెప్-3
మూడు టేబుల్ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి.. ముఖంపై 10 నిమిషాలపాటు మసాజ్ చేయండి. ఇలా చేస్తే.. ముఖం చాలా షైనీగా, అందంగా కనిపిస్తుంది.
స్టెప్ 4
తేనెను ముఖంపై అప్లై చేసి.. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖం మిలమిల మెరిసిపోయి.. అందంగా కనిపిస్తారు. తక్షణమే గ్లో వస్తుంది.
తక్షణ మెరుపు కోసం ఈ టిప్స్ కూడా పాటించండి.. వెంటనే రిజల్ట్ మీకు తెలుస్తుంది.
గోధుమపిండి, పాలు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి, పచ్చిపాలు కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అలాగా ముఖంపై మృత కణాలు తొలగిపోయి.. తాజాగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
తేనె, పసుపు, గోధుమ పిండి ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ గోధుమపిండి, టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారు.
గోధుమ పిండి, రోజ్ వాటర్, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ గోధుమపిండి, రోజ్ వాటర్, అలోవెరా జెల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి.. చర్మం కాంతివంతంగా, తాజాగా మెరుస్తుంది.
Also Read: తెల్లజుట్టు నివారణకు.. పర్మినెంట్ సొల్యూషన్
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.