BigTV English

Beetroot Juice: హార్ట్ పేషెంట్స్ బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చా ?

Beetroot Juice: హార్ట్ పేషెంట్స్ బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చా ?

Beetroot Juice: బీట్‌రూట్ అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఈ రసాయనం రక్త నాళాలను విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందుకే తరచుగా బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా గుండె జబ్బుల లక్షణాలను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.


బీట్‌రూట్ జ్యూస్ యొక్క ప్రయోజనాలు:

అధిక రక్తపోటు:
బీట్‌రూట్ జ్యూస్‌‌ అధిక నైట్రేట్ కంటెంట్ ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితవంగా రక్తపోటును నియంత్రిస్తుంది.


గుండె జబ్బులు:
తరచుగా బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇందులో రక్త నాళాలను సడలించే, రక్త ప్రసరణను మెరుగుపరిచే నైట్రేట్లు ఉంటాయి.అందుకే బీట్ రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.

అథెరోస్క్లెరోసిస్:
రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతే బీట్‌రూట్ జ్యూస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నాళాలను మరింత సరళంగా చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.

గుండె వైఫల్యం:
బీట్‌రూట్ జ్యూస్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ఆంజినా:
బీట్‌రూట్ రసం ఛాతీ నొప్పి (ఆంజినా) నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండెకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అంతే కాకుండా ఇది నొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

Also Read: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

బీట్‌రూట్‌ను ఎలా తీసుకోవాలి ?
తాజాగా తయారుచేసిన బీట్‌రూట్ జ్యూస్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి ఫలితాల కోసం.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోండి. తద్వారా దాని పోషకాలు త్వరగా ప్రభావం చూపుతాయి.
బీట్‌రూట్‌ను పచ్చిగా కూడా తినవచ్చు. ఇది కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటుంది.

బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం:
బీట్‌రూట్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. బీట్‌రూట్‌లను బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత బ్లెండర్‌లో నీరు వేసి మిక్సీ పట్టండి. రుచి కోసం మీరు నిమ్మరసం, తేనె కూడా ఇందులో కలుపుకోవచ్చు.

Related News

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Acidity: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే రక్త హీనత ఉన్నట్లే !

Diabetes In India: ఇండియాలో పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. కారణాలు ఇవే !

Liver Health: లివర్ హెల్త్ కోసం ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Rainy Season Diseases: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

Big Stories

×