BigTV English

Mysaa: మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్న రష్మిక.. పోస్టర్ తోనే పిచ్చెక్కించిందిగా

Mysaa: మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్న రష్మిక.. పోస్టర్ తోనే పిచ్చెక్కించిందిగా

Mysaa: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.  కన్నడ హీరోయిన్ గా  ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొంతకాలంగా రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  యానిమల్ దగ్గరనుంచి ఈ మధ్య రిలీజ్ అయిన కుబేర వరకు అమ్మడు పట్టిందల్లా బంగారంగానే మారింది.


 

వరుసగా యానిమల్, పుష్ప2, ఛావా, సికిందర్, కుబేర తో కలిపి ఐదు సినిమాలు చేస్తే సికిందర్ మినహా నాలుగు సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి.ఇక దీంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇక  ఈ సినిమాల  తర్వాత కూడా  రష్మిక చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే అని చెప్పొచ్చు.  ఇప్పటికే  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సెట్స్ మీద ఉంది. ఇక ఇది కాకుండా బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న థామాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.


Manchu Manoj: ఇంటి నుంచి గెంటేసినా.. తండ్రి కోసం ఆ పని చేసిన మనోజ్

ఇక ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు రొమాంటిక్ పాత్రలతో అలరించిన ఈ భామ ఇప్పుడు తన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అయింది.  రవీంద్ర పూలే దర్శకత్వంలో రష్మిక ఒక సినిమా చేయనున్నట్లు ఇప్పటికే అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఆ సినిమాను టైటిల్ తో పాటు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మైసా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 

మైసా  పోస్టర్ లో  రష్మిక భయంకరమైన అవతారంలో కనిపిస్తుంది. ముఖం నిండా రక్తంతో కత్తిని పట్టుకుని భీకరమైన యుద్ధరంగంలో ఉన్న యోధురాలిగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినమాలో రష్మిక వారియర్ గా నటిస్తుందని తెలుస్తోంది. ” ధైర్యం ఆమె బలం.. ఆమె సంకల్పంలో లేదు కనికరం.  ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి వస్తుంది”  అంటూ మేకర్స్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని రష్మికను ఈ సినిమాలో చూడబోతున్నారు ప్రేక్షకులు. ఆమె కూడా ఇలాంటి ఒక పాత్ర తానెప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక  పోస్టర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మైసా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Kayadu Lohar: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

Big Stories

×