BigTV English

Pragya Jaiswal: మాట్లాడడానికి ఏమీ లేదు.. బాలయ్యతో ఏజ్ గ్యాప్‌పై ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pragya Jaiswal: మాట్లాడడానికి ఏమీ లేదు.. బాలయ్యతో ఏజ్ గ్యాప్‌పై ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pragya Jaiswal: తెరపై జోడీగా కనిపించే హీరోహీరోయిన్లు ఒకే వయసు ఉంటుంది అనుకోవడం అసాధ్యం. చాలావరకు హీరోహీరోయిన్లకు ఎంతోకొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇక చాలావరకు సీనియర్ హీరోలు అయితే ఏకంగా దాదాపు తమకంటే 30 ఏళ్లు చిన్న అయిన హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారు. అలా ఇటీవల కాలంలో ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా సక్సెస్‌ఫుల్ అనిపించుకున్న జంట ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు హిట్ సినిమాల్లో నటించగా వారి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మొదటిసారి నోరువిప్పింది ప్రగ్యా. ‘డాకు మహారాజ్’లో కావేరి పాత్రలో నటించడానికి ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదుర్కుందో బయటపెట్టింది.


మంచి స్టార్ట్

2025 సంక్రాంతికి విడుదలయిన సినిమాల్లో ‘డాకు మహారాజ్’ ఒకటి. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి రేసులో నిలిచి మంచి విజయం సాధించింది. ఇందులో ప్రగ్యా, బాలయ్య జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికే ‘అఖండ’లో ఒకసారి హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించిన ఈ జంట.. మరోసారి ‘డాకు మహారాజ్’తో లక్కీ పెయిర్ అనిపించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్.. ఈ సినిమా గురించి, బాలయ్యతో కలిసి నటించడం గురించి మాట్లాడింది. ‘‘ఈ ఏడాది నాకు చాలా మంచిగా స్టార్ట్ అయ్యింది. ఇంతకంటే ఎక్కువ నేను ఆశించడం లేదు’’ అంటూ ‘డాకు మహారాజ్’ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేసింది.


మంచి నిర్ణయం

‘‘డాకు మహారాజ్ (Daaku Maharaj) సంక్రాంతికి మాత్రమే కాకుండా నా బర్త్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటినుండి అందులో నేను చేసిన కావేరి పాత్రకు ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాను. నేను ఒక డాకు పాత్రలో నటిస్తానని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు నన్ను డాకు మహారాణి అని పిలుస్తున్నారు. కావేరి పాత్రలో చేయడం అనేది నాకు డిఫరెంట్ ఛాలెంజ్‌లాగా అనిపించింది. నేను ముందు చేసిన పాత్రలకంటే ఇది చాలా డిఫరెంట్. అందుకే మూవీ విడుదలయినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారా అని భయపడ్డాను. ఇప్పుడు నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చింది ప్రగ్యా.

Also Read: తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై హింట్.?

స్క్రిప్ట్‌ను బట్టి ఉంటుంది

‘‘బాలకృష్ణ (Balakrishna) లాంటి లెజెండ్ నుండి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఆయనకు ఫిల్టర్స్ లేవు. చాలా గౌరవంగా ఉంటారు. అందరిని సమానంగా చూస్తారు. చాలా మంచి వ్యక్తి. మంచి కో స్టార్. క్యాస్టింగ్ అనేది రాసుకున్న పాత్రను బట్టి జరుగుతుంది. దానికి న్యాయం చేసి, స్క్రీన్‌పై మంచిగా కనిపిస్తే చాలు. అలాంటప్పుడు ఏజ్ గ్యాప్ అనేది అసలు మ్యాటరే కాదు. అఖండకు షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే ఎలా ఉంటుందా అని ఫీలయ్యాం. కానీ దాని షూటింగ్ చాలా బాగా జరిగింది. ప్రేక్షకులు వారిని భార్యాభర్తలు అని నమ్ముతున్నంత వరకు, స్టోరీకి న్యాయం జరుగుతున్నంత వరకు నేను కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు’’ అంటూ ఏజ్ గ్యాప్ మ్యాటర్‌పై స్పందించింది ప్రగ్యా జైస్వాల్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×