Tesla Showroom In Mumbai: అపర కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇండియాలోకి అడుగు పెడుతోంది. తొలి షో రూమ్ ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 15న టెస్లా షో రూమ్ ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముంబై జియో వరల్డ్ సెంటర్ లో ఈ ఓపెనింగ్ వేడుక నిర్వహించనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఇందుకోసం ఇప్పటికే టెస్లా కంపెనీకి చెందిన 5 వై మోడల్ కార్లు ఇండియాకు చేరుకున్నట్లు వెల్లడించాయి. ఈ కార్లను చైనాలోని తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తొలి షో రూమ్ కు వచ్చే డిమాండ్ ను బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ టెస్లా షో రూమ్ ను ఓపెన్ చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
4 వేల చదరపు అడుగుల షో రూమ్ ఏర్పాటు
ఇక ముంబైలోని ప్రముఖ బిజినెస్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) బిజినెస్ డిస్ట్రిక్ట్ లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే టెస్లా రెంట్ కు తీసుకుంది. వినియోగదారులకు పార్కింగ్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ షో రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోరూమ్ కు నెలకు రూ. 35 లక్షలు రెంట్ పే చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రతి ఏటా అద్దె 5 శాతం పెంపు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 5 సంవత్సరాలకు గాను యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి టెస్లా లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ లో యాపిల్ స్టోర్ కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న కాగా, అడ్వాన్స్ గా రూ.2.11 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
Coming soon pic.twitter.com/kquMXghCnK
— Tesla India (@Tesla_India) July 11, 2025
చాలా కాలంగా భారత్ లోకి వచ్చే ప్రయత్నం
వాస్తవానికి టెస్లా కంపెనీ చాలా కాలంగా ఇండియాలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్సులు తగ్గించాలని టెస్లా కోరింది. అయితే, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్నది. ఇందుకు మస్క్ నో చెప్పడంతో టెస్లా రాక ఆలస్యం అయ్యింది.
ప్రధాని మోడీతో మస్క్ సమావేశం
రీసెంట్ గా ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో మస్క్ ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్యాక్సుల విషయంపై చర్చించారు. ఈ నేపథ్యంలో 40 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.34లక్షలు కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని భారత్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో టెస్లా ఎంట్రీ ఖాయం అయ్యింది. త్వరలోనే టెస్లా షో రూమ్ ప్రారంభం కాబోతోంది.
Read Also: స్టార్టప్స్ ఓనర్ల కోసం టెక్ నేషన్.. ఐలాండ్‌ని కొన్న బాలాజీ శ్రీనివాసన్, ఎవరాయన?