BigTV English
Advertisement

Summer Food: ఇది బయట ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి

Summer Food: ఇది బయట ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి

Summer Food: వేసవికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఎండలు మండిపోతాయి. ఈ వేడి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంటే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఎండ వేడిలో చల్లగా, రిఫ్రెష్‌గా ఉండే ఆహారాల్లో కాకాడి, దోసకాయ టాప్‌లో ఉంటాయి. ఈ రెండూ కుకుమిస్ సాటివస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవే అయినా, చూడడానికి కాస్త వేరుగా కనిపిస్తాయి. అలాగే రుచి, వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు వేటికవే వేరువేరుగా ఉంటాయి. వీటి గురించి, ముఖ్యంగా కాకాడి వేసవిలో ఎలా సూపర్‌గా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..


కాకాడి ఏంటి?
కాకాడి అంటే ఒక రకం దోసకాయ, సౌత్ ఆసియా, ముఖ్యంగా ఇండియాలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని హిందీ, మరాఠీ, గుజరాతీలో ‘కాక్డి’ అని పిలుస్తారు. ఇది చిన్నగా, గుండ్రంగా లేదా కొంచెం పొడవుగా, సన్నని ఆకుపచ్చ తొక్కతో, మందమైన చారలతో ఉంటుంది. ఇవి జ్యూసీ ఫ్లెష్, తేలికైన తీపి టేస్ట్‌తో ఉంటాయి. దీన్ని పచ్చిగా, కొంచెం ఉప్పు, మిరపకాయ చల్లి తినడం లేదా సలాడ్, రైతాలో వేసుకోవడం కామన్. వేసవిలో గ్రామీణ మార్కెట్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వరకు దీని హవా నడుస్తుంది.

కాకాడి vs దోసకాయ
రెండూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినవే అయినప్పటికీ, ఈ రెండిటిలో కొన్ని తేడాలున్నాయి.


లుక్ & టెక్స్చర్
కాకాడి చిన్నగా, మెత్తగా, సాఫ్ట్ సీడ్స్‌తో, తినగలిగే సన్నని తొక్కతో ఉంటుంది. దోసకాయలు పెద్దగా ఉంటాయి. కొన్ని రకాల్లో మందమైన తొక్క తీయాల్సి ఉంటుంది. సీడ్స్ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి.

టేస్ట్
కాకాడి కొంచెం తీపిగా ఉంటుంది. వీటిలో నీటి శాతం కూడా తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దోసకాయలు తేలికైన టేస్ట్ నుంచి, కాయ రకాన్ని బట్టి కొంచెం చేదుగా ఉంటాయట.

వంటకాల్లో
కాకాడిని సౌత్ ఆసియాలో పచ్చిగా, మసాలాలు లేదా పెరుగుతో తింటారు. దోసకాయలని సలాడ్స్, పికిల్స్, శాండ్‌విచ్‌లు, వండిన డిషెస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.

ప్రాంతం
కాకాడి ఇండియాలో కల్చరల్‌గా ఇంపార్టెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. దోసకాయలు ఇంగ్లీష్, పర్షియన్ రకాలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

పోషకాలు
రెండిటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి. ఈ రెండిటిలో విటమిన్-సి, కె, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ దాదాపు సమానంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాకాడి తొక్క తినడం వల్ల కొంచెం ఎక్కువ ఫైబర్, న్యూట్రియెంట్స్ లభిస్తాయట.

వేసవిలో కాకాడి ఎందుకు తినాలి?
కాకాడిని వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాకాడిని వేసవిలో తినడం వల్ల చల్లదనం, హైడ్రేషన్ వం టివి వస్తాయట. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కూడా కాకాడి సహాయపడుతుందట.

ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాసిడ్ రిఫ్లక్స్, స్కిన్ ఇరిటేషన్ వంటి వాటిని తగ్గించేందకు కూడా కాకాడి హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కాకాడిలో ఉండే విటమిన్-సి ఇమ్యూన్ పవర్ పెంచేందుకు సహాయపడుతుందట. ఇందులోని విటమిన్-కె బోన్స్‌‌ని బలంగా ఉంచడంలో తోడ్పడుతందని నిపుణులు చెబుతున్నారు. బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి పొటాషియం సహకరిస్తుంది.

వెయిట్ కంట్రోల్
కాకాడిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, కుకుర్బిటాసిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వేడి వల్ల వచ్చే టైర్డ్‌నెస్‌ని కూడా అడ్డుకుంటాయట.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×