BigTV English

Breast Milk: మాడ్రన్ మమ్మీలు.. తల్లి పాలు బిడ్డకు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

Breast Milk: మాడ్రన్ మమ్మీలు.. తల్లి పాలు బిడ్డకు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

Breast Milk: పుట్టిన పసిబిడ్డలకు తల్లిపాలను మించిన ఔషధం మరొకటి ఉండదు. దంతాలు పెరగడం నుంచి మొదలు పెడితే బిడ్డ శరీరంలోని థైరాయిడ్ గ్లాండ్ ఉత్పత్తుల వరకు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పాలు ఎంతో అవసరం. చిన్నారులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా తల్లి పాలు సహాయపడతాయి.


తల్లి పాలలో ఉండే విటమిన్లు, మినరల్స్, శిశువు మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపగలవట. అందుకే పసి పిల్లలకు డబ్బా పాలు పట్టించడం మంచిది కాదని డాక్టర్లు చెబుతారు. కానీ, ఇప్పుడున్న రోజుల్లో జాబ్ చేయడానికి టైం లేదని, రోజంతా ఇంట్లోనే ఉండి బిడ్డను చూసుకోలేక బిడ్డకు పాలు ఇవ్వడం కూడా మానేస్తున్నారు. మాడ్రన్ మమ్మీలు అని చెప్పుకుంటూ తిరిగే మరికొందరు ఆడవారు అందం తగ్గిపోతుందనే అపోహతో పసిపిల్లలకు డబ్బా పాలు పట్టిస్తారు.

తల్లికీ మేలు
బ్రెస్ట్ మిల్క్ వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శిశువుకు పాలు ఇవ్వడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుందట. అంతేకాకుండా ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ల రిస్క్ కూడా తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఆడవారిలో టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే పిల్లలకు పాలు ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. మరికొందరిలో బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.


పాలలో పోషకాలు
బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి కావాల్సిన అన్ని పోషకాలు తల్లి పాలలో ఉంటాయట. తల్లి పాలలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ బాడీస్, ఎంజైమ్స్ బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

తల్లి పాలవిరుగుడు, కేసైన్ అనే ప్రోటీన్ బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయట. ఈ పాలలో ఉండే ఇమ్యునోగ్లోబులి-A ఇన్‌ఫెక్షన్స్ నుంచి బిడ్డను రక్షించేందుకు సహాయం చేస్తుందట. అంతేకాకుండా బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో కూడా ఈ ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. తల్లి పాలలోని లప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు బిడ్డ శక్తిని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయట.

ALSO READ: వేసవిలో కూడా చలిగా ఉందా..?

తల్లి పాలలో ల్యాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్‌లో దాదాపు 40 శాతం కేలరీలు ఉంటాయి. చిన్నారి కడుపులోకి పాలు వెళ్లిన తర్వాత కాల్షియాన్ని తీసుకోవడానికి ఈ ల్యాక్టోజ్ సహాయపడుతుందట. పాలలోని ఒలిగో సాకరైడ్స్ బిడ్డ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో తోడ్పడతాయి.

తల్లి పాలలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఇవి సహాయపడతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి మినరల్స్‌తో పాటు విటమిన్-A, C, D, E, K కూడా ఉన్నాయి. చిన్నారి దంతాలు, ఎముకలను బలంగా చేయడంతో పాటు ఇమ్యూన్ పవర్‌ని పెంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×