WhatsApp Update: టెక్ ప్రియులకు అలర్ట్. మనం రోజూ ఉపయోగించే టెక్నాలజీ విషయంలో చిన్న మార్పుతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు టెక్ వార్తల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. లేదంటే చిక్కుల్లో పడే ఛాన్సుంది. మీరు ల్యాప్‌టాప్ లేదా పీసీ ద్వారా డెస్క్ టాప్ WhatsApp వాడుతుంటే ఇది మీకో సీరియస్ వార్నింగ్ అని చెప్పవచ్చు.
కేంద్రం హెచ్చరిక
ఎందుకంటే WhatsApp డెస్క్‌టాప్ వర్షన్‌లో బయటపడిన ఓ సీరియస్ బగ్ వల్ల మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. హ్యాకర్లు ఓ బగ్‌ను ఉపయోగించి మీ డివైస్ గానీ లేదా మీ వ్యక్తిగత డేటా విషయంలో ముప్పుగా మారవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం CERT In అందరికీ హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి సమయంలో ఎలా జాగ్రత్త పడాలి? ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరికీ ఈ హెచ్చరిక?
ఈసారి ఈ హెచ్చరిక ప్రత్యేకంగా WhatsApp డెస్క్‌టాప్ యూజర్ల కోసం. మీరు ల్యాప్‌టాప్ లేదా పీసీలో WhatsApp యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వర్షన్ 2.2450.6 కన్నా తక్కువ వెర్షన్ వాడుతున్నవారు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే ఛాన్సుంది.
Read Also: Become Crorepati: రోజుకు రూ.500 సేవింగ్..కోటి రూపాయల .
బగ్ ఎలా పనిచేస్తుంది?
ఈ సెక్యూరిటీ లోపం ఫైల్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఉంటుంది. WhatsApp డెస్క్‌టాప్ యాప్ MIME టైప్, ఫైల్ ఎక్స్‌టెన్షన్ మధ్య సరైన సరిపోలిక లేకపోవడం వల్ల ఈ బగ్ ఏర్పడింది. దీని అర్థం ఏమిటంటే WhatsApp కొన్ని ఫైళ్లను అసలు వాటిలా గుర్తించలేకపోతుంది. ఆ లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు హానికరమైన ఫైళ్లను, అవి సురక్షితమైనవి అన్నట్టు మారుస్తారు. మీరు వాటిని ఓపెన్ చేసిన క్రమంలో ఓ ఫైల్… వాస్తవానికి అది ఓ డేంజరస్ స్క్రిప్ట్ అయ్యే అవకాశముంది.
సోషల్ మీడియా స్కాముల హవా
ఇప్పటికే WhatsApp ద్వారా అనేక స్కాములు జరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు, ఆఫర్‌ల పేరుతో లింకులు, QR కోడ్ స్కాములు ఇవన్నీ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సెక్యూరిటీ బగ్ కూడా దానికి తోడు అయ్యిందని నిపుణులు చెబుతున్నారు.
మీరు చేయాల్సింది ఏంటి?
-ముందుగా మీ WhatsApp డెస్క్‌టాప్ యాప్‌ను తక్షణమే అప్‌డేట్ చేయండి.
-తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేయకండి
-స్పామ్ లింకులు/అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయకుండా ఉండండి
-ఫేక్ మెసేజ్‌లపై నమ్మకంతో స్పందించకండి
-నమ్మని లేదా తెలియని నంబర్లను వెంటనే బ్లాక్ చేయండి
వినియోగదారులకు CERT In కీలక సలహాలు
-అప్‌డేట్ చేసిన వెర్షన్ వాడండి
-ఫైళ్లను ఓపెన్ చేయడానికి ముందు అవి ఎవరినుంచి వచ్చాయో పరిశీలించండి
-అన్‌నౌన్ లింక్స్ క్లిక్ చేయొద్దు
-వచ్చే ఎలర్ట్స్‌ను తక్కువగా అంచనా వేయొద్దు
-ఈ రోజుల్లో డిజిటల్ టూల్స్ మన దైనందిన జీవితాల్లో కీలకభాగమైపోయాయి. కానీ అదే టెక్నాలజీ మనపై తిరగబడి ముప్పుగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాట్సాప్ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.