Alcohol Side effects: చాలా మంది వీకెండ్ వస్తే రిలాక్స్ అవ్వాలనుకుంటారు. ఆ సందర్భంలో గ్లాసులకు గ్లాసులు మందు తాగడం సాధారణం అయిపోయింది. కానీ ఆ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్‌లో అధికంగా మందు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగినప్పుడు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయట. కొంచెం తాగితే శరీరం ఓపిక పడుతుంది కానీ ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని వైద్యులు చెబుతున్నారు.
అధిక మద్యం తాగితే లివర్‌పై చెడు ప్రభావం పడే అవకాశం ఉందట. మద్యం ఎక్కువగా తాగితే లివర్ దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి రోగాలు వస్తాయని వెల్లడిస్తున్నారు.
మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మందిలో మనసిక ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందట. మందు తాగిన తర్వాత కొద్దిసేపు రిలీఫ్ లాగ అనిపించవచ్చు, కానీ తర్వాత డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధికంగా మద్యం తీసుకోవడం వల్ల హార్ట్‌బీట్‌పై చెడు ప్రభావం పడుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. కొంతమందిలో దీని వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందట. ఒకేసారి ఎక్కువగా మందు తాగితే అల్సర్లు, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.
అతిగా మందు తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒకేసారి ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
వీలైనంత వరకు తక్కువ మోతాదులో మందు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఖాళీ కడుపుపై మద్యం తాగకూడదట. దీని వల్ల అనేక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందరూ అతిగా తాగుతున్నారని ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు. మద్యాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
వీకెండ్‌ను ఎంజాయ్ చేయడం తప్పు కాదు. కానీ ఆరోగ్యాన్ని మైండ్‌లో ఉంచుకొని మద్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా తాగడం వల్ల కొంత సేసు సరదాగా అనిపించినా, తర్వాత అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.