BigTV English

Testosterone Level: మగాళ్లలో టెస్టోస్టెరాన్ పెరగాలంటే, సింఫుల్ గా ఈ పని చేయండి!

Testosterone Level: మగాళ్లలో టెస్టోస్టెరాన్ పెరగాలంటే, సింఫుల్ గా ఈ పని చేయండి!

పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడం మొదలుకొని ఎములను ఆరోగ్యంగా ఉంచడం వరకు సాయపడుతుంది. రకరకాల కారణాలతో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ పెంచుకోవచ్చు. ఇంతకీ అవేంటంటే..


టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుందంటే?   

❂ వృద్ధాప్యం


పురుషులో వయసు పెరగడం కారణంగా సహజంగానే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. 30 ఏండ్ల తర్వాత టెస్టోస్టెరాన్  సంవత్సరానికి సుమారు 1% తగ్గుతుంది.

❂ ఊబకాయం

ఊబకాయం కూడా పురుషులలో తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి కారణం అవుతుంది.

❂ దీర్ఘకాలిక అనారోగ్యం

దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారిలోనూ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతోంది. ఓపియాయిడ్లు, గ్లూకోకార్టికాయిడ్లు, కెమోథెరపీ మందులు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది.

❂ ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి పురుషులలో తక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి కారణం అవుతుంది.

టెస్టోస్టెరాన్ పెంచడానికి సహజ మార్గాలు

❂ క్రమం తప్పని వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది.

❂ తగినంత నిద్ర

టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేయడానికి శరీరానికి తగినంత నిద్ర అవసరం. రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే వారిలో ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.

❂ ఒత్తిడి కంట్రోల్

ఒత్తిడి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ధ్యానం, దీర్ఘ శ్వాస, ఇతర ఒత్తిడి తగ్గింపు మార్గాలు టెస్టోస్టెరాన్ ను పెంచేందుకు సాయపడుతాయి.

❂ సమతుల్య ఆహారం

ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్స్ కూడిన ఫుడ్స్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి.

❂ సహజ సప్లిమెంట్లు

విటమిన్ డి, జింక్, మెగ్నీషియం లాంటి సహజ పదార్ధాలు టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.

❂ఆల్కహాల్ మానుకోండి

ఆల్కహాల్, డ్రగ్స్ వాడకం టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. వీలైనంత వరకు వాటిని మానుకోవాలి.

టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల కలిగే లాభాలు   

❂ మెరుగైన లైంగిక సామరథ్యం

పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో టెస్టోస్టెరాన్ కీలకపాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ తక్కువ అయితే లిబిడో, అంగస్తంభన సమస్యలు కలుగతాయి.

❂ బలమైన కండరాలు

టెస్టోస్టెరాన్ కండరాలను ఆరోగ్యంగా, బలంగా మార్చుతుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కండర బలాన్ని పెంచుతుంది.

❂ ఎముకల ఆరోగ్యం

ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో టెస్టోస్టెరాన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఎముక సాంద్రతను పెంచడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ముప్పును తగ్గిస్తుంది.

❂ మెరుగైన మానసిక స్థితి

టెస్టోస్టెరాన్ పురుషులలో మానసిక స్థితిని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

❂శక్తి పెరుగుదల

టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.

Read Also:  మధ్యాహ్నం ఆ పని చేస్తే పేగు క్యాన్సర్ రాదా? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి!

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×