Heels Side effects: హైహీల్స్ వేసుకోవడం అనేది చాలా మంది ఆడవారికి ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ స్టైలిష్ లుక్‌గా మారిపోయింది. అయితే, ఎక్కువ సమయం హీల్స్ వేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
తరచుగా హైహీల్స్ వేసుకోవడం వల్ల చాలా మందికి కాళ్లు, మడమల్లో విపరీతంగా నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైహీల్స్ వేసుకున్నప్పుడు పాదాల ఆకారంలో చాలా మార్పు వస్తుంది. దీని వల్ల మడమల కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా మందిలో కాళ్లలో వాపు, నొప్పులు వచ్చే ఛాన్స్ ఉందట.
హైహీల్స్ వేసుకున్నప్పుడు శరీర బరువు మొత్తం కాళ్ల ముందు భాగం మీదనే పడుతుందట. దీని వల్ల మోకాలు, వెన్నెముక, నడుము నొప్పులు నొప్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా హైహీల్స్ వేసుకునే వారికి ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటి వల్ల మోకాళ్లపై కూడా ఒత్తిడి పడుతుంది. దీంతో కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే రోజంతా హైహీల్స్ మాత్రమే వేసుకోకూడదని అంటున్నారు.
చాలా మంది హార్డ్‌గా ఎండే హీల్స్ వేసుకుంటారు. దీని వల్ల చర్మంపై కూడా చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంటుందట. తరచుగా హైహీల్స్ వేసుకుంటే కోల్స్, బ్లిస్టర్స్‌తో పాటు కరేబుల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏం చేస్తే సేఫ్..?
ప్రతి రోజూ హీల్స్ వేసుకోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటి ప్రభావాన్ని తగ్గించుకోవడం సాధ్యం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా ఎక్కువ ఎత్తుగా ఉండే హీల్స్ వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో పని చేసే వారు, మోడలింగ్ చేసే వారు చాలా తరచుగా పెన్సిల్ హీల్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీరికి కాళ్ల నొప్పులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే వీరు మరీ ఎత్తుగా ఉండే హీల్స్ వాడడాన్ని వీలైనంత వరకు తగ్గించడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే 2-3 అంగుళాల ఎత్తు ఉండే హీల్స్ వేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, సాఫ్ట్, లాటెక్స్ పదార్థాలతో తయారు చేసిన హీల్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఇవి పాదానికి మరింత సహజమైన స్థితి ఇవ్వడంలో సహాయపడుతాయి. దీని వల్ల కాళ్లపై ఒత్తిడి పడకుండా చేయడం సాధ్యం అవుతుందట.
రోజంతా హీల్స్ వేసుకొని ఉండాల్సి వస్తే మాత్రం అప్పుడప్పుడు వాటిని తీసి పక్కన ఉంచడం మంచిది. దీని వల్ల కాళ్లపై చెడు ప్రభావం పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అప్పుడప్పుడు ఫుట్ మసాజ్, వాకింగ్ మోకాలను కదిలించడం వింటివి చేస్తూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. కాళ్లలో రక్త ప్రసరణ సరిగా జరగడానికి కూడా ఇలాంటివి హెల్ప్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నొప్పులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.