ఒకప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి, బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ మళియక్కల్ (Nikhil Maliyakkal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu Season 8) లో కంటెస్టెంట్ గా పాల్గొని, తన ఆట, మాట తీరుతో ఆడియన్స్ హృదయాలను దోచుకొని, పలు టాస్క్లలో అదరగొట్టేసి టైటిల్ విజేతగా నిలిచారు. హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమను చెప్పుకొని ఆడియన్స్ ను సెంటిమెంట్ తో కొట్టిన నిఖిల్ నటి కావ్య (Kavya )ను తలుచుకుంటూ బ్రేకప్ అయ్యిందనే విషయాన్ని బయట పెట్టాడు. హౌస్ లో ఉన్నంతసేపు ఎప్పటికైనా సరే కావ్యనే తన భార్య అని, హౌస్ నుంచి బయటకు వెళ్లిన వెంటనే మొదట ఆమె దగ్గరకు వెళ్లి, కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడైనా సరే తన జీవితంలోకి తిరిగి రమ్మని కోరుకుంటానని, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది నమ్మిన ఆడియన్స్ కూడా నిఖిల్ కి మద్దతు పలుకుతూ వచ్చారు.
బంధం తెగిపోయినట్టేనా..?
అయితే నిఖిల్ కి మద్దతు పెరుగుతున్న సమయంలో కావ్య స్పందించింది. అతడు మాయదారి అని, మోసగాడు అని, కపట బుద్ధి కలవాడు అని నమ్మకండి అంటూ హింట్ ఇచ్చింది. కానీ ఎవరు కూడా ఆమె మాటలు నమ్మలేదు. ఇకపోతే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి వెళ్తానని చెప్పిన నిఖిల్, మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లలేదు. ఇకపోతే కావ్య తనపై ఎంత కోపంగా ఉందో గ్రహించిన ఈయన మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లలేదు. ఇక తను తిరిగి తన జీవితంలోకి రాదని అర్థమై ఆమెకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా కావ్య ‘చిన్ని’ అనే సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ కూడా ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి మళ్లీ కనుమరుగయ్యాడు. దీంతో అప్పటినుంచి అభిమానులు నిఖిల్, కావ్యను ట్యాగ్ చేస్తూ వరుసగా పోస్ట్లు పెడుతూ ఉంటే, ఇక ఈ వ్యవహారానికి పులిస్టాప్ పెట్టాలని రంగంలోకి దిగారు నిఖిల్.
ఇకపై ఎవరితో కూడా జతకట్టవద్దు – నిఖిల్
నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా..” మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నాది ఒక చిన్న విన్నపం. పరిస్థితులు మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. మీ ప్రేమ, సపోర్టు ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి పని పరంగా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితో కూడా లింక్ చేయకండి. ఇలా ఎవరి పోస్ట్ లకు నన్ను ట్యాగ్ చేయకండి. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. లవ్ యు ఆల్” అంటూ రాసుకు వచ్చాడు. ఇక ఈ ఒక్క మాటతో కావ్యకు తనకు మధ్య బంధం తెగిపోయిందని, ఇకపై ఎవరూ కూడా ఈ బంధాన్ని అతికించే ప్రయత్నం చేయకండి అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశారు నిఖిల్. మరి దీనిపై కావ్య ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.