BigTV English

Eye Sight: హమ్మయ్య.. ఇక కంటి చూపు తిరిగి వచ్చేస్తాది.. థాంక్స్‌ టు కొరియన్ సైంటిస్ట్స్!

Eye Sight:  హమ్మయ్య.. ఇక కంటి చూపు తిరిగి వచ్చేస్తాది.. థాంక్స్‌ టు కొరియన్ సైంటిస్ట్స్!

దృష్టిని కోల్పోయాక తిరిగి పునరుద్ధరించడం అనేది అంత సులువు కాదు. నిజానికి అది జరిగే ప్రక్రియ కూడా కాదు. అయితే ఈ రంగంలో పురోగతి సాధించాలని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఆ రంగంలో వారు విజయం సాధించినట్టు ప్రకటించారు. రెటినిటిస్ పిగ్మెంటోసా అని పిలిచే కంటి వ్యాధికి చికిత్స చేయడంలో వారు విజయం సాధించారు. నేచర్ కమ్యూనికేషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ వ్యాధికి కారణం అయ్యే ఒక రకమైన ప్రోటీన్ ను నిరోధించడం ద్వారా చికిత్స చేయవచ్చని వారు కనుగొన్నారు.


రెటినిటిస్ పిగ్మెంటోసా అనేది జన్యుపరంగా వచ్చే ఒక వ్యాధి. ఇది కాంతి సున్నితత్వాన్ని తట్టుకోలేదు. కాంతి పడితే రెటీనా కణాలు క్రమంగా మరణించడం ప్రారంభమవుతుంది. చివరికి పూర్తి అంధత్వం కలుగుతుంది. దీనికి సమర్థవంతమైన చికిత్స ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి కారణంగా చూపు పోయిన వారికి తిరిగి దృష్టి రావడం అనేది జరగలేదు. అయితే దీనిపైన కొరియన్ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు.

యాంటీ బాడీలు కనిపెట్టి
కొరియన్ అడ్వాన్స్‌డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు చేపలపై అధ్యయనం చేశారు. చేపలు రెటీనాను పోగొట్టుకున్న తరువాత తిరిగి దానిని పునరుత్పత్తి చేయగలవు. కానీ క్షీరదాలు మాత్రం ఎందుకు చేయలేవు అని పరిశోధించారు. క్షీరదాలలో PROX1 అనే ప్రోటీన్ ప్రత్యేక కంటి కణాలు ఆ ప్రక్రియను అడ్డుకుంటున్నట్టు గుర్తించారు. కొత్త న్యూరాన్లు రూపాంతరం చెందకుండా ఈ ప్రోటీన్ అడ్డుకుంటుందని కనుగొన్నారు. దీంతో పరిశోధకులు ఆ ప్రోటీన్ కార్యాకలాపాలను నిరోధించే యాంటీ బాడీని అభివృద్ధి చేశారు.


ఎలుకలపై ప్రయోగం
కనిపెట్టిన యాంటీ బాడీలను ఎలుకలపై ప్రయోగించారు. ఆ ఎలుకలకు ముందుగా రెటినిస్ పిగ్మెంటోసా వచ్చేలా చేశారు. ఆ ఎలుకలకు ఈ వ్యాధి వల్ల రెటీనా దెబ్బతిని చూపు పోయింది. ఆ దెబ్బతిన్న కణాలను తిరిగి పునరుద్ధరించడానికి కొత్తగా కనిపెట్టిన యాంటీ బాడీని ప్రయోగించారు. ఎలుకలలో రెటీనా కణాలు తిరిగి పునరుత్పత్తి కావడం ప్రారంభించాయి. అంతేకాదు ఎలుకలకు తిరిగి దృష్టి వచ్చింది. దీనితో ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు కొరియన్ శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమవుతున్నవారు. ఈ క్లినికల్ ట్రయల్స్ 2028లో జరిగే అవకాశం ఉంది. ఈ పద్ధతి విజయవంతం అయితే ఎంతోమందికి తిరిగిపోయిన చూపును తెప్పించవచ్చు. రెటీనా‌ వ్యాధులకు అద్భుతంగా చికిత్స చేయవచ్చు. వారసత్వంగా వచ్చే కంటి వ్యాధులను కూడా చాలావరకు తగ్గించవచ్చు.

Related News

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

Anger: చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా ?

Fatty Liver: ఈ డ్రింక్ తాగితే.. ఫ్యాటీ లివర్‌కు చెక్ !

Tips For Tan Removal: ముఖంపై ట్యాన్.. తొలగిపోవాలంటే ?

Dandruff: ఈ టిప్స్ పాటిస్తే.. చుండ్రు ఈజీగా తగ్గిపోతుంది తెలుసా ?

Bad Breath: నోటి దుర్వాసన తగ్గాలంటే ?

Big Stories

×