Lips Astrology -The Shape of your lips Determines your Personality: చంద్రవదనంలో కళ్లు తర్వాత కనువిందు చేసేవి పెదవులే.. అరవిరిసిన పెదాలపై పదాలు కట్టిన కవికులు ఎందరెందరో.. మోవిగని మొగ్గ అని వర్ణించినవారు కొందరైతే.. గులాబిరేకులే పెదవుల సోకు అని ఇంకొందరు అంటారు. అయితే ఆధారాల వైనాన్ని వివరించే శాస్త్రమూ ఉంది అదే లిపాలజీ. ఇది పెదవుల నిర్మాణాన్ని బట్టి మనుష్యుల వ్యక్తిత్వం ఉంటుందట. మరి వాటి గురించి తెలుసుకుందామా!
ముద్ద మందార పెదాలు..
ముద్దమందారం లాగా నిండుగా పెదవులు ఉండే వాళ్లు మెండు మనసు కలిగి ఉంటారట. అయితే వీళ్లు చిన్న విషయానికే బుంగమూతి పెట్టేస్తుంటారని లిపాలజీ చెబుతుంది.
పలుచటి పెదాలు..
సన్నగా పూలరేకుల్లా ఉండే పెదవులు ఉన్నవారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇలాంటి వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారట.
పువ్వు విచ్చుకున్నట్లు ఉన్న పెదాలు..
ఇలాంటి లిప్స్ ఉన్నవాళ్లు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుందట. అంతేకాదు ఎదుటి వారు ఏమైనా చెబుతుంటే మనస్ఫూర్తిగా వింటారట.
Also Read: సన్‌స్క్రీన్ చర్మానికి మంచిదేనా..?
పప్పీ పెదాలు..
మందపాటి, వెడల్పుగా ఉండే పెదవులను పప్పీ పెదాలు అంటారు. ఇలాంటి వాళ్లు విశాల హృదయం కలిగి ఉంటారట. ఎదుటి వారిపై సానుభూతి కలిగి ఉంటారని లిపాలజీ సెలవిస్తుంది.
స్టంగ్ లిప్స్..
చిన్నగా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇలాంటి పెదవులు ఉన్నవారు స్వార్ధం కలిగి ఉంటారు. వీళ్లు ఎదుటివారు చెప్పే మాయమాటలను ఈజీగా నమ్మేస్తుంటారట.
పై పెదవి పెద్దగా..
Also Read: Ear Tinnitus : ఎవరైనా మీ చెవుల్లో ఈలలు వేస్తున్నట్లు అనిపిస్తుందా..?
పై పెదవి పెద్దగా ఉన్న వాళ్లు చాలా వినయంగా, నిజాయితీగా ఉంటారని..సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువేనని లిపాలజీ తేల్చిచెప్పింది.
క్రింద పెదవి పెద్దగా..
పై పెదవి కన్నా క్రింద పెదవి లావుగా ఉన్న వాళ్లు సాహస కృత్యాలంటే ఇష్టం ఉంటుందట. కొత్త పరిచయాలు చేసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. తరుచూ ప్రయాణాలు చేయాలని ఆశపడుతుంటారట.
Disclaimer: ఈ కథనాన్ని ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా రూపొందిందాం. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదించండి.