BigTV English

MLC Kavitha meets KTR: డిల్లీలో చెల్లితో అన్న ములాఖత్.. తండ్రికి ఏమైందో మరి..?

MLC Kavitha meets KTR: డిల్లీలో చెల్లితో అన్న ములాఖత్.. తండ్రికి ఏమైందో మరి..?

KTR Meets MLC Kavitha in Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవితను నేడు కేటీఆర్ పరామర్శించనున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న ఆమెను కుటంబ సభ్యులు, న్యాయవాది కలవడానికి కోర్టు రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలవరకు అనుమతినిచ్చింది. కవిత భర్త అనిల్, అన్న కేటీఆర్, పీఏ శరత్, అడ్వకేట్ మోహిత్‌కు మాత్రమే కోర్టు అనుమతిచ్చింది. దీంతో కేటీఆర్ ఆదివారం సాయంత్రం చెల్లిని కలసి బాగోగులు తెలుసుకోనున్నారు.


కాగా నిన్న(శనివారం) సాయంత్రం కవితను.. తన భర్త అనిల్, పీఏ శరత్, మోహిత్‌లు కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవితను ముందుగా ఈడీ కస్టడీ కోరింది. తీహార్ జైలులో ఉన్న ఆమెని విచారించడానికి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది కోర్టు. మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు పేర్కొనడంతో శుక్రవారం కవితను తీహార్ జైలు నుంచి సీబీఐ కస్టడీకి తీసుకెళ్లారు. కాగా కవితను రేపు ఉదయం 10 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో కేటీఆర్ కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవితను కలవడానికి తండ్రి కేసీఆర్ రాకపోవడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తల్లి కూడా కలిసింది. కానీ కేసీఆర్ మాత్రం కనికరించడం లేదు. దీంతో కేసీఆర్ వారించినా వినకుండా ఢిల్లీ లిక్కర్ దందాలో పాలుపంచుకున్నారని అందుకే కేసీఆర్ కూతురు మీద కోపంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇక కొందరైతే కేసీఆర్‌కు సర్జరీ అయ్యిందని.. ప్రయాణాలు చేయలేరని.. అందుకే వెళ్లట్లేదని అంటున్నారు.


Also Read: 1.30 లక్షల మందితో సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తాం: కేసీఆర్

కాగా ఢిల్లీ లిక్కర్ కేసు కవితకు ఉచ్చుబిస్తోందని చెప్పొచ్చు. ఒకవైపు ఈడీ. మరోవైపు సీబీఐ.. రెండు దర్యాప్తులు చేపట్టడంతో కవితకు కష్టమే అంటున్నారు న్యాయ నిపుణులు. కాగా కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కుమారుడి పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు అందుకు ససేమిరా అంది. దీంతో కవిత మళ్లీ ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×