E-Paper

నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం.. రోజూ ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే చాలు!

నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం.. రోజూ ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే చాలు!

Belly fat: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం కేవలం అందాన్ని తగ్గించడమే కాకుండా.. డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కఠినమైన డైటింగ్ లేదా గంటల తరబడి జిమ్‌ వంటివి చేయకుండానే.. మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కేవలం 30 రోజుల్లోనే ఈ పొట్ట కొవ్వును మంచులా కరిగించవచ్చు. అందుకు సహాయపడే ఆ 5 సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించే 5 సూపర్ ఫుడ్స్:

బరువు తగ్గడం వేరు, బెల్లీ ఫ్యాట్ తగ్గడం వేరు. శరీరంలోని ఇతర భాగాల కంటే పొట్ట భాగంలో కొవ్వు చాలా మొండిగా ఉంటుంది. అయితే.. మెటబాలిజం రేటును పెంచే ఆహారాలను తీసుకోవడం ద్వారా పొట్ట కొవ్వును వేగంగా కరిగించవచ్చు. మీ మెటబాలిజాన్ని పరుగులు పెట్టించి, నెల రోజుల్లో ఫ్లాట్ బెల్లీని ఇచ్చే ఆ 5 సూపర్ ఫుడ్స్ ఇవే..

1. మెంతులు, జీలకర్ర:
మన పోపుల పెట్టెలో ఉండే మెంతులు, జీలకర్ర బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో మంత్రంలా పని చేస్తాయి. జీలకర్ర శరీరంలోని క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. మెంతుల్లో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. రాత్రి వేళ ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టుకుని పరగడుపున తాగడం వల్ల నెల రోజుల్లో పొట్ట సైజు తగ్గడం మీరే గమనిస్తారు.

2. ఓట్స్ ఫైబర్ పవర్‌హౌస్:
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశలకు బదులుగా ఓట్స్ తినడం బెస్ట్. ఓట్స్‌లో ‘బీటా-గ్లూకాన్’ అనే కరిగే ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే.. కాకుండా, పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా చూస్తుంది. ఇది తిన్న తర్వాత ఎక్కువ సమయం కడుపు నిండినట్లు అనిపించడం వల్ల అనవసరమైన జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటారు. చక్కెర వేసిన ఓట్స్ కాకుండా.. కూరగాయలు వేసి చేసిన ఓట్స్ ఉప్మా లేదా పండ్ల ముక్కలతో కూడిన ఓట్ మీల్ తీసుకోవడం మంచిది.

3. గ్రీన్ టీ:
బెల్లీ ఫ్యాట్ అనగానే గుర్తొచ్చే వాటిలో గ్రీన్ టీ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో ఉండే ‘ఎపిగాలోకాటెచిన్ గాలెట్’అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజాన్ని అద్భుతంగా పెంచుతుంది. ఇది శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో చక్కెర అస్సలు వాడకూడదు. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు.

4. చియా సీడ్స్ / సబ్జా గింజలు:
ఈ చిన్న గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట భాగంలో పేరుకుపోయిన విసెరల్ ఫ్యాట్ ను టార్గెట్ చేసి కరిగిస్తాయి. నీటిని పీల్చుకుని ఇవి ఉబ్బడం వల్ల, వీటిని తింటే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. ఒక చెంచా గింజలను నీటిలో నానబెట్టి..ఆ నీటిని రోజంతా కొద్ది కొద్దిగా తాగవచ్చు లేదా మజ్జిగ, లెమన్ వాటర్‌లో కలుపుకుని తీసుకోవచ్చు.

5. గుడ్లు:
బరువు తగ్గాలనుకునే.. వారికి ప్రొటీన్ చాలా అవసరం. గుడ్లలో లీన్ ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు శరీరం దాన్ని అరిగించడానికి ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల పొట్ట కొవ్వు ఆటోమేటిక్‌గా కరుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు ఉడికించిన గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది.

ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడంతో పాటు.. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, మైదా, చక్కెర వంటి రిఫైన్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. రాత్రి వేళ 7-8 గంటల నిద్ర కూడా బరువు తగ్గడానికి ఎంతో అవసరం. ఈ చిన్న మార్పులతో కేవలం 30 రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్‌కు బై-బై చెప్పేయండి.

Related News

మీది ప్రేమా లేక ఆకర్షణ మాత్రమేనా? తేడా ఏంటో తెలుసుకోకుండా అందరూ చేసే తప్పులివే

వేసవిలో జీన్స్ వద్దు.. ఫ్యాషనెబుల్‌గా కనిపించేందుకు ఈ స్టైలిష్ బాటమ్స్ ట్రై చేయండి

ఒంటరితనంతో బాధపడుతున్నారా? గాసిప్ చేయడం దీనికి మంచి పరిష్కారం.. ఎలాగంటే

పెద్ద రిస్క్ అని తెలిసినా భయపడరు.. ఈ తేదీల్లో పుట్టినవారి చేతి నిండా ధనమే

పొట్టకొవ్వు ఏం చేసినా తగ్గడం లేదా? నో టెన్షన్.. ఒక నెలలో 4 నుంచి 5 కిలోలు తగ్గే టిప్స్ మీ కోసం

బంగారం కంటే విలువైన టమాటా.. కిలో టమాటా విత్తనాల ధర రూ.3 కోట్లు.. ఎందుకంటే?

ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు? మీ బాడీషేప్‌కు తగిన బట్టలు ఇలా ఎంచుకోండి

వారమంతా పనిచేసి అలసిపోయారా? వీకెండ్స్ ఈ పనులు చేస్తే ఫుల్ రిలాక్స్

×