E-Paper
Advertisement

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!
Advertisement

Moong Dal Namak Para: సాయంత్రం టీ తాగే సమయంలో పక్కన ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఎంత బాగుంటుంది కదూ. ఎప్పుడూ చేసుకునే సమోసాలు, పకోడీలు కాకుండా ఈసారి కాస్త కొత్తగా, రుచిగా ఉండేలా పెసరపప్పు నమక్‌పారా ట్రై చేయండి. సాధారణంగా నమక్‌పారాలను కేవలం మైదాతోనే తయారుచేస్తారు. కానీ దానికి పెసరపప్పు జోడించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ స్నాక్‌ను చాలా తక్కువ సమయంలో, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజుల పాటు నిల్వ ఉండి, ప్రతి సాయంత్రం టీ సమయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

పెసరపప్పు – అర కప్పు
గోధుమపిండి లేదా మైదా – ఒక కప్పు
వాము – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
నెయ్యి లేదా వేడి నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయించడానికి సరిపడా
నీళ్లు – తగినంత

Advertisement

Also Read: ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

తయారీ విధానం:

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, రుబ్బుకున్న పెసరపప్పు మిశ్రమం, వాము, జీలకర్ర, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వేడి నెయ్యి లేదా నూనె వేసి పిండికి బాగా పట్టించాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని చపాతీ పిండికంటే కాస్త గట్టిగా కలుపుకుని, మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి.

తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఆ చపాతీని కత్తితో నచ్చిన పరిమాణంలో డయామండ్ ఆకారంలో లేదా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడెక్కిన తర్వాత మంటను మధ్యస్థంగా ఉంచి కట్ చేసుకున్న నమక్‌పారాలను నూనెలో వేసి, మంచి బంగారు రంగు వచ్చేవరకు తిప్పుతూ వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్‌పై వేస్తే అదనపు నూనె పీల్చేస్తుంది. చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో భద్రపరుచుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు నమక్‌పారా సిద్ధమైనట్లే.

Also Read: విరిగిపోయిన పాలతో ఇలా అంగూరీ రసమలై చేయండి.. బేకరీ స్టైల్ టేస్ట్ గ్యారెంటీ!

Tags

Related News

ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

ఖరీదైన క్రీములు అక్కర్లేదు..డ్రై హ్యాండ్స్‌ను సాఫ్ట్‌గా మార్చే నేచురల్ టిప్స్!

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!

ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీ..సింపుల్ రెసిపీ

నోట్లో ఇట్టే కరిగిపోయే ఆలూ పరాటా..ఈజీగా ఇలా చేయండి!

అప్పటికప్పుడు పాలతో ఇలా కలాకండ్ చేశారంటే.. అచ్చం స్వీట్ షాప్ రుచి రావడం ఖాయం!

Big Stories

Advertisement
×