E-Paper
Advertisement

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..
Advertisement

ఒక శవానికి 66 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారంటే నమ్మగలరా. అయినా, అన్నేళ్లపాటు శవం ఎక్కడుంది? చెడిపోకుండా ఎలా ఉంది అనేగా మీ సందేహం? అయితే మీరు తప్పకుండా 1911లో అమెరికాలో జరిగిన ఈ అరుదైన, చిత్రమైన సంఘటన గురించి తెలుసుకోవల్సిందే.

రైలు దొంగ.. పొరపాటు, చివరికి..

అమెరికాకు చెందిన ఎల్మర్‌ మెక్‌కర్డీ దొంగతనాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. 19, 20వ శతాబ్దాల మధ్య అమెరికాలోని ఓక్లహోమా ప్రాంతంలో అతడు పలు నేరాలకు పాల్పడ్డాడు. ఎక్కువ అతడు రైళ్లలో దొంగతనాలు చేసేవాడు. వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. అలా ఓ రోజు.. అతడు ఓ తప్పటడుగు వేశాడు. ఓ రైల్లో భారీగా నగదు, నగలు తరలిస్తున్నట్లు తెలుసుకుని.. దొంగతనానికి ప్లాన్ చేశాడు. కానీ, అతడికి ఆ రైల్లో ఏమీ దొరకలేదు. చివరికి.. అతడు ప్యాసిజర్ల దగ్గర డబ్బులు దోచుకున్నాడు. వెళ్తూ వెళ్తూ.. లోకో పైలెట్ వాచ్ కూడా లాక్కున్నాడు.

పోలీసుల కాల్పుల్లో మరణం

Advertisement

అప్పటివరకు ఎల్మర్క్ జనాలను నేరుగా దోచుకోలేదు. జనాలు కూడా ఎప్పుడూ ఎల్మర్క్‌ను సరిగ్గా చూడలేదు. ఈ చోరీతో అతడి ఆచూకీ దొరికేసింది. బాధితులు చెప్పిన వివరాలతో పోలీసులు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపులు జరిపారు. 1911, అక్టోబర్ 7న ఓక్లహోమాలోని ఓ ప్రాంతంలో ఎల్మర్ ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడిని పట్టుకోడానికి వెళ్తే.. పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఎల్మర్ మరణించాడు. ఆ తర్వాత అతడి శవాన్ని స్మశానానికి అప్పగించారు. అతడి బంధువులు వచ్చే వరకు ఆ శవాన్ని అక్కడే ఉంచాలని చెప్పారు. దీంతో శవం పాడవ్వకుండా కొన్ని రసాయనాలు రాసి భద్రపరిచారు.

శవంతో వ్యాపారం

అప్పట్లో ఎల్మర్ పేరొందిన దొంగ కావడంతో.. అతడి శవాన్ని చూసేందుకు జనాలు ఆసక్తి చూపేవారు. అప్పుడే ఆ స్మశాన కాపరికి ఓ ఐడియా వచ్చింది. అతడి శవాన్ని ప్రదర్శనగా పెట్టి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. పైగా అతడి శవం కోసం కుటుంబికులు కూడా ఎవరూ రాకపోవడంతో అదే మంచి ఛాన్స్ అని భావించాడు. ఎల్మర్క్ శవాన్ని ప్రదర్శనకు ఉంచాడు. దాన్ని చూసేందుకు వచ్చేవారి నుంచి 5 సెంట్లు వసూలు చేసేవాడు. అలా అతడి శవం ఒక ప్రదర్శన వస్తువుగా మారిపోయింది. అతడిని ‘ది ఎంబాల్మ్డ్ బాండిట్’ అని పిలిచేవారు. అంటే ‘భద్రపరిచిన బందిపోటు’ అని అర్థం.

ఇక్కడ అసలు ట్విస్ట్..

Advertisement

కథ ఇంతటితో ముగియలేదు. 1916లో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. తాము ఎల్మర్ సోదరులమని చెప్పారు. అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. వారిని నమ్మిన నిర్వాహకుడు వాళ్లకు ఎల్మర్ శవాన్ని అప్పించాడు. కానీ, వారు చెప్పింది నిజం కాదు. వారు.. కార్నివాల్ నిర్వాహకులు. ఎల్మర్ శవాన్ని తమ ప్రదర్శనల్లో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్లారు.

60 ఏళ్ల పాటు ప్రదర్శనల్లోనే..

అప్పటి నుంచి ఎల్మర్ శవం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రదర్శన వస్తువుగా ప్రయాణిస్తూనే ఉంది. వివిధ కార్నివాల్‌లు, వినోద ప్రదర్శనలు, మ్యూజియంలలో దాన్ని ప్రజలకు చూపిస్తుండేవారు. కాలం గడిచే కొద్ది.. అది ఒక మృతదేహం అనే సంగతి మరుగున పడిపోయింది. దాన్ని కొందరు నకిలీ బొమ్మగా భావించారు. చివరికి కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో ఉన్న ఒక వినోద కేంద్రంలోని ఫన్ హౌస్‌కు ఆ ఎల్మర్ మృతదేహం చేరుకుంది. అక్కడ దాన్ని ఒక బొమ్మలా ప్రదర్శనకు ఉంచారు.

టీవీ షూటింగ్‌తో బయటపడిన రహస్యం

1976, డిసెంబర్ 8న ‘ది సిక్స్ మిలియన్ డాలర్ మ్యాన్’ అనే టెలివిజన్ షో కోసం ఫన్ హౌస్‌ను అద్దెకి ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది.. బొమ్మ అనుకుని ఎల్మర్ శవాన్ని పక్కకు జరిపేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకరు చేయి పట్టుకుని గట్టిగా లాగారు. దీంతో అది ఊడి వచ్చింది. అందులో మనిషి ఎముక కనిపించడంతో అంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి వచ్చి.. అది బొమ్మ కాదు, మనిషి శవమని నిర్ధరించారు. తదుపరి విచారణలో అది ఎల్మర్ మెక్‌కర్దీ మృతదేహంగా గుర్తించారు. చివరికి.. 1977, ఏప్రిల్ 22న ఓక్లహోమాలోని గుత్రీ పట్టణంలో ఎల్మర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. మళ్లీ అతడి మృతదేహాన్ని బయటకు తీసి ప్రదర్శనకు పెట్టకుండా సమాధిపై సుమారు రెండు అడుగుల మందంతో కాంక్రీట్‌ను పోశారు. మరణించిన తర్వాత ఒక వ్యక్తి శరీరం అన్నేళ్లు ప్రదర్శన వస్తువుగా మారడం చరిత్రలోనే అత్యంత చిత్రమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది.

Also Read: ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

Tags

Related News

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

ఖరీదైన క్రీములు అక్కర్లేదు..డ్రై హ్యాండ్స్‌ను సాఫ్ట్‌గా మార్చే నేచురల్ టిప్స్!

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!

ఏడాది నిల్వ ఉండే.. పండు మిరపకాయ పచ్చడి పక్కా కొలతలతో!

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మొఘలై ఎగ్ కర్రీ..సింపుల్ రెసిపీ

నోట్లో ఇట్టే కరిగిపోయే ఆలూ పరాటా..ఈజీగా ఇలా చేయండి!

Big Stories

Advertisement
×