EPAPER

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Rosy Cheeks: అందంగా కనిపించాలని అనేది ప్రతీ ఒక్కరి కళ. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా మేకప్ లు వేసుకుంటూ అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. లిప్ స్టిక్, ఐ లైనర్, ఫౌండేషణ్, బ్లష్, క్రీమ్, పౌడర్ వంటి అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎంతటి జిడ్డు ముఖం అయినా కూడా అందంగా మార్చుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ గ్యారెంటీ ఇస్తూ మార్కెట్లో ఇటువంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచుతున్నారు.


కొంత మంది మాత్రం మేకప్ లేకుండానే అందంగా కనిపించాలని కోరుకుంటారు. చర్మం మెరిసిపోవాలని ఉదయం లేచి ముఖాన్ని అద్దంలో చూసుకోగానే అందంగా కనిపించాలని అనుకుంటారు. అయితే మేకప్ లేకుండానే సహజంగా అందంగా ఉండాలని కోరుకునే వారి కోసం ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ కంటే ఎంతో అద్భుతంగా తయారు చేసే చిట్కాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఐప్ ముక్కలతో మసాజ్


ప్రతీ రోజూ నిద్రపోయే ముందు, లేదా నిద్ర లేచిన తర్వాత ఐస్ ముక్కలతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా చర్మాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు చర్మం కూడా స్థితిస్థాపకతను పెంచేలా చేస్తుంది. ఇలా ఐస్ ముక్కలతో మసాజ్ చేసుకున్న తర్వాత మెత్తని టవల్ తీసుకుని తుడుచుకోవాలి. ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల చర్మంలో ఉండే మురికి, మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది.

2. స్టీమ్ థెరపీ

ముఖం సహజంగానే అందంగా మెరిసిపోవాలంటే స్టీమ్ థెరపీ అద్భుతంగా పని చేస్తుంది. వారంలో 3 సార్లు అయినా వేడి నీటితో ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తొలగించి శుభ్రం చేస్తుంది.

3. బీట్రూట్ ఫేస్ ప్యాక్

బీట్రూట్ చర్మాన్ని అందంగా చేస్తుంది. తరచూ బీట్రూట్ జ్యూస్ చేసి తాగడం లేదా బీట్రూట్ ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకుని వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బీట్రైట్ లేదా రోజ్ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ముఖం గులాభీ రంగులోకి మారుతుంది. బీట్రూట్ జ్యూస్ లో అలోవెరా జెల్ కలుపుకుని పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సహజమైన గులాబీ రంగు ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

4. రోజ్ వాటర్

ప్రతీ రోజూ బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూకు రెండు నుంచి మూడు సార్లు అయినా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని రోజ్ వాటర్ అప్లై చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Porphyria: వెల్లుల్లి తింటే ప్రాణాలు పోతాయట, అమెరికన్ లేడీకి వింత రోగం!

Children Eye Problems: వామ్మో సెల్ ఫోన్, పిల్లలకు అస్సలు ఇవ్వకండి, లేదంటే ఈ ముప్పు తప్పదు!

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Big Stories

×