Skin Care For 30s: 30 ఏళ్ల తర్వాత చర్మంలో అనేక మార్పులు వస్తుంటాయి. ఈ సమయంలో చర్మం మునుపటి కంటే సున్నితంగా, పొడిగా మారుతుంది. ఈ వయస్సులో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం.. తద్వారా మీ చర్మం యవ్వనంగా , వయస్సుతో పాటు మెరుస్తూ కనిపిస్తుంది. కాంతివంతమైన చర్మం కోసం మీ చర్మాన్ని యవ్వనంగా , తాజాగా ఉంచడంలో సహాయపడే స్కిన్ కేర్ టిప్స్ ప్రతి రోజు పాటించడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయండి:
చర్మాన్ని హైడ్రేటెడ్ గా , ఆరోగ్యంగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ ముఖ్యం. 30 ఏళ్ల తర్వాత చర్మం పొడిబారుతుంది. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. అందుకే ఉదయం , రాత్రి రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయండి.
సన్‌స్క్రీన్ ఉపయోగించండి:
సన్‌స్క్రీన్ చర్మాన్ని సూర్యుడి హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది. ఇది చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు, చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాబట్టి కనీసం 30 SPF ఉన్న విస్తృత-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. వాతావరణం ఎలా ఉన్నా ప్రతిరోజూ దీనిని అప్లై చేయండి. మీరు బయట ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లై చేయండి.
క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయండి:
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం మెరుస్తుంది. 30 సంవత్సరాల వయస్సు తర్వాత.. చర్మ కణాల ఉత్పత్తి నెమ్మదిస్తుంది, కాబట్టి క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. మీ చర్మ రకాన్ని బట్టి తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌ను ఎంచుకుని.. వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడండి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎక్స్ పోలియేట్ చేయడం వల్ల ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపిస్తుంది. అంతే కాకుండా తెల్లగా మెరిసేలా తయారవుతుంది.
ఫేస్ ప్రొడక్ట్స్:
30 సంవత్సరాల వయస్సు తర్వాత.. చర్మంపై ముడతలు , సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సమయంలో యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. రెటినోల్, విటమిన్ సి లేదా పెప్టైడ్స్ వంటి పదార్థాలను కలిగి ఉన్నప్రొడక్ట్స్ ఎంచుకోండి. ఇవి చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశ వంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖం తాజాగా కనిపించాలంటే కొన్ని రకాల టిప్స్ ప్రతి రోజు పాటించాలి. ఇవి మీకు కాంతి వంతమైన చర్మాన్ని అందించడంతో పాటు చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తాయి.
Also Read: రాత్రి పూట కలబంద జెల్‌లో ఇవి కలిపి వాడితే.. గ్లోయింగ్ స్కిన్
వ్యాయామం:
30 సంవత్సరాల వయస్సు తర్వాత.. చర్మంపై ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. చర్మ సంరక్షణతో పాటు, ప్రతిరోజూ కొన్ని ముఖ వ్యాయామాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ చూపుడు వేలు కీళ్ళను వంచి, నుదిటిపై, కళ్ళ కింద , పెదవుల దగ్గర వృత్తాకార వ్యాయామం చేయవచ్చు. దీంతో పాటు.. మార్కెట్లో లభించే జాడే రోలర్ కూడా ముఖ చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 2-3 నిమిషాలు దీనిని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు కూడా రాకుండా ఉంటాయి.