BigTV English

Tripura Murder Case: ప్రేయసితో గొడవ పడ్డ యువకుడు.. కట్ చేస్తే ఫ్రీజర్‌లో శవం.. అసలు కిల్లర్ వేరే

Tripura Murder Case: ప్రేయసితో గొడవ పడ్డ యువకుడు.. కట్ చేస్తే ఫ్రీజర్‌లో శవం.. అసలు కిల్లర్ వేరే

Tripura Murder Case|మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నో ట్విస్టులతో కూడుకున్న ఆ హత్య కేసు మరవక ముందే అలాంటిదే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒక యువకుడి మృతదేహం ఒక ఫ్రీజర్ లో లభించింది.మరో షాకింగ్ విషయమేమిటంటే.. ఈ కేసులో హంతకుడే కాదు.. అతని తల్లిదండ్రులు కూడా శవాన్ని దాచడానికి అతనికి సహాయం చేశారు. సినీ ఫక్కీలో ఒక యువతి కోసం ఈ హత్య జరిగింది. ఈ దారుణ ఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపుర రాజధాని అగర్తలాలో నివసించే రమేష్ కుమార్ (26), ప్రీతి (24) అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఇటీవలే వారిద్దరూ గొడవపడ్డరు. దీంతో ప్రీతి అతనితో మాట్లాడడం మానేసింది. కానీ రమేష్ మాత్రం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే ప్రీతి తల్లిదండ్రులు చనిపోయవడంతో ఆమె బాగోగులు.. ఆమె బావ గోపాల్ (29) చూసుకుంటున్నాడు. రమేష్.. ప్రీతిని ఇబ్బంది పెడుతున్నాడని గోపాల్ కు తెలిసింది. ఈ కారణంగా రమేష్‌ని గోపాల్ కలిసి అతడిని మందలించాడు.

కానీ ఆ తరువాత రమేష్ కనిపించకుండా పోయాడు. రెండు రోజుల పాటు రమేష్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. రమేష్ చివరి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి ప్రీతి బావ గోపాల్ ఇంటి వరకు చేరుకున్నారు. అయితే షాకింగ్ విషయమేమిటంటే రమేష్ మృతదేహం మరో ప్రదేశంలో ఒక ఫ్రీజర్ లో లభించింది. ఈ హత్య కేసుని రెండు రోజుల్లోనే పరిష్కరించిన పోలీసులు ఈ విషయాలు వెల్లడించారు.


పోలీసుల కథనం ప్రకారం.. రమేష్ ని ఫోన్ చేసి గోపాల్ తన ఇంటికి పిలిచాడు. అక్కడ గోపాల్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి రమేష్ గొంతుకు ఒక తాడు బిగించి.. హత్య చేశారు. ఆ తరువాత రమేష్ శవాన్ని ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ లో దాచి పెట్టారు. కానీ త్వరలోనే దాని వల్ల దుర్వాసన వస్తుందని తెలిసి.. దాన్ని ఒక ఫ్రీజర్ లో పెట్టారు. ఆ తరువాత గోపాల్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని కారులో రమ్మన్నాడు. గోపాల్ తల్లిదండ్రులు సమీపంలోని గాండాచేరా గ్రామంలో నివసిస్తున్నారు. గోపాల్ తల్లిదండ్రులు తీసుకువచ్చిన కారులో రమేష్ శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత శవాన్ని తమ ఇంట్లోని ఒక పెద్ద ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో దాచిపెట్టారు.

Also Read: చేతులకు బేడీలతో టీ విక్రయిస్తున్న యువకుడు.. భార్యా బాధితుడి నిరసన

ఆస్తి కోసం హత్య
ప్రీతి తల్లిదండ్రులు కొన్ని నెలల క్రితం ఒక కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తరువాత ప్రీతిని పెళ్లిచేసుకుంటే ఆమె ఆస్తిని సొంతం చేసుకోవచ్చని గోపాల్, అతని తల్లిదండ్రులు ప్లాన్. అందుకే గోపాల్ తన మరదలు ప్రీతితో ప్రేమగా ఉండేవాడు. కానీ ప్రీతి మరో యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి గోపాల్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అయితే ప్రీతి, ఆమె ప్రియుడు రమేష్ గొడవపడడంతో గోపాల్ తనకు ఇది అవకాశంగా భావించి.. రమేష్ ని అంతం చేశాడు. ప్రస్తుతం అగర్తలా పోలీసులు గోపాల్ ని, అతని తల్లిదండ్రులు అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేశారు.

Related News

Kolkata Crime: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే

Meerut News: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. ఉత్తరాదిలో ఆగడాలు.. టార్గెట్ మహిళలు-అమ్మాయిలే

Delhi News: రూటు మార్చిన దొంగలు.. ఎర్రకోటలో భారీ చోరీ, బంగారు కలశాలు మాయం!

Attack On Law Student: కారులో బంధించి 60 చెంపదెబ్బలు.. వామ్మో, ఇలా కూడా కొడతారా? ఇదిగో వీడియో

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

Big Stories

×