E-Paper
Advertisement

పెళ్లయ్యాక డబ్బు విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే…

పెళ్లయ్యాక డబ్బు విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే…
Advertisement

Money Management:పెళ్లికి ముందు ఏం చేసినా ఎవరు అడిగే వారు ఉండరు.అంతా మన ఇష్టారాజ్యం.మనం ఎలా ఖర్చు పెట్టాలనుకుంటే అలా ఖర్చు పెట్టేస్తాం.మనల్ని అడిగే వాళ్లే ఉండరు.అసలు డబ్బులు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు పోయాయో కూడా తెలియదు.కానీ పెళ్లయ్యాక సీన్ మారిపోతుంది.

ఒకటి కాదు, రెండు కాదు ఇంటి రెంట్ అని, కిరాణా ఖర్చులని, ఈ EMI అని, ఆ EMI అని, కరెంటు బిల్లులని, తల్లిదండ్రుల బాధ్యతలని ఇలా వరుసగా ఖర్చులు వచ్చి పడుతూనే ఉంటాయి.సరిగ్గా అదే సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ షురూ అవుతుంది.

జీతం, ఖర్చుల విషయంలో క్లారిటీ ఉండాలి

Advertisement

అసలు నీ జీతం ఏం చేస్తున్నావ్? ఇంటి ఖర్చులన్నీ నేనేందుకు పెట్టాలి? ఇలాంటి ప్రశ్నలు ఇద్దరి మధ్య రావడం సహజం.మరి అలాంటి సమస్య భార్యాభర్తల మధ్య రాకుండా ఉండాలంటే ఈ కొన్ని విషయాలని వాళ్ళు క్లియర్ గా మాట్లాడేసుకుంటే మంచిది.ముందుగా ఎలాంటి దాపరికం లేకుండా ఇద్దరు జీతం ఎంతో ఒకరికి ఒకరు కి తెలిసి ఉండాలి.

భార్యకి వచ్చేది ఎంత? భర్త వెనుకేసేది ఎంత? ఇలాంటి విషయాల్ని అస్సలు దాచవద్దు.అలాగే ఇద్దరికీ ఏమైనా లోన్లు ఉన్నాయా, EMIలు ఎంత కట్ అవుతున్నాయి, తల్లిదండ్రులకి ప్రతినెలా ఇంత ఇవ్వాల్సి ఉంటుంది.వంటి విషయాలని వంటి విషయాలని క్లియర్ గా ముందే చెప్పుకోవాలి.

డబ్బులు ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలుసుకోవాలి

Advertisement

ముఖ్యంగా ఇద్దరు ఎంత సంపాదిస్తున్నారు, అనేదానికంటే, ఆ డబ్బులు ఎక్కడ ఎలా ఖర్చవుతున్నాయి అనేది ఇద్దరికీ తెలియడం చాలా ముఖ్యం.అయితే చాలామందికి వచ్చే అనుమానం ఇద్దరి జీతం కలపాల్సిందేనా అని.

అలా చేయాలన్న రూల్ ఏమి లేదు.కొంతమంది ఇద్దరు జీతాలు కలిపి ఇంటి ఖర్చులు చూసుకుంటారు.మరికొందరు ఒకరి జీతం ఖర్చు పెట్టుకుని, మిగతా జీతం ఇతర అవసరాలకు వాడుకుంటుంటారు.మరికొందరు ఒకరు జీతాన్ని మొత్తం ఖర్చు పెట్టేసి మరొకరి జీతాన్ని సేవింగ్స్ కింద దాచి దాచుకుంటారు.అయితే ఏ పద్ధతి అయిన ఇద్దరికీ నచ్చాలి.

శాలరీ రాగానే కొంత సేవింగ్స్ పక్కన పెట్టాలి

ముఖ్యంగా జీతం ఇలా పడిందో లేదో షాపింగ్ లంటూ బయటికి అవుటింగ్ కి వెళ్దామంటూ, ఆన్లైన్ ఆర్డర్లు అంటూ, ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తే వచ్చిన డబ్బు కాస్త నెల తిరిగేలోపే మాయమైపోతుంది.అలా కాకుండా ఉండాలంటే ముందుగా శాలరీ క్రెడిట్ అవ్వగానే కొంచెం డబ్బు తీసి పక్కన పెట్టండి.ఆ తర్వాతే మిగిలిన డబ్బులని ఖర్చులకు వాడండి.

నెల ఖర్చులకి ముందే లెక్క వేసుకోవాలి

ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది నెల ఖర్చులను ముందే లెక్క వేసుకోవాలి. ఇలా మొదట్లోనే ఆ ఖర్చులకు సంబంధించిన ఒక చిన్న లిస్టు తయారు చేసుకుంటే అనవసర ఖర్చులు ఉండవు.ఇక ఇంటి రెంట్, EMIలు, కరెంట్ బిల్లు, కిరాణా ఖర్చులు, పిల్లల ఖర్చులు పేరెంట్స్ కి ఇచ్చే డబ్బు, సేవింగ్స్ ..ఇలా అన్నింటికీ ముందే ఒక లెక్క పెట్టేసుకోవాలి.అప్పుడే నెల చివర్లో డబ్బంతా ఏమైపోయింది అన్న క్వశ్చన్ రైజ్ అవ్వదు.

ప్రతి చిన్న ఖర్చుకి లెక్క అడగకూడదు

ఇక ప్రతి చిన్న ఖర్చుకు లెక్క అడగకూడదు.భార్య ఒక డ్రెస్ కొనుక్కుంటే ఎందుకు కొన్నావు అని అడగడం, భర్త ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే ఎంత ఖర్చు చేశావు అని అడగడం మంచిది కాదు.ఇలా ప్రతిదానికి లెక్క అడిగితే కూడా బాగోదు.అందుకే ఇద్దరికీ కొంత పర్సనల్ గా డబ్బు ఖర్చు పెట్టుకునేలా ఉండాలి.

ఆ డబ్బులు వాళ్ళకి నచ్చినట్టు ఖర్చు చేసుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి.

పెద్ద ఖర్చుల విషయంలో కలిసి నిర్ణయం తీసుకోవాలి

చిన్న చిన్న ఖర్చులు పర్లేదు కానీ పెద్ద ఖర్చయితే మాత్రం ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకోవాలి.చిన్న చిన్న ఖర్చులైతే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య ఉండదు కానీ కారు కొనడం, పెద్ద లోన్ తీసుకోవడం లేదా కాస్ట్లీ ట్రిప్ కి వెళ్లడం ఎక్కడైనా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.

అలా కాకుండా ఇది నా డబ్బు నేను సంపాదించాను అని పట్టుబడితే మాత్రం ఆ తర్వాత గొడవలు రావడం పక్కా.

తల్లిదండ్రులకు ఇచ్చే డబ్బుపై ముందే మాట్లాడాలి

ఇక కన్న తల్లిదండ్రులకి పిల్లలు డబ్బులు పంపించాలి అనుకోవడం సహజం.

పెంచి పెద్ద చేసిన వాళ్లకి ఆ డబ్బు అలా వాళ్ల వృద్ధాప్యంలో పంపిస్తే వాళ్లకి ఉపయోగపడుతుంది కూడా. ఇది తప్పు కాదు కానీ పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఒకరికొకరు ఎంత పంపించాలో ముందే డిసైడ్ అయితే ఆ తర్వాత ఎలాంటి గొడవలు రావు.

పెళ్లికి ముందున్న అప్పుల గురించి చెప్పాలి

ఇక పెళ్లికి ముందు ఏదైనా లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డు ఉన్నా ముందే భార్యకి చెప్పేస్తే గొడవ ఉండదు.అప్పుడే అప్పు ఎంత ఉంది, EMI ఎంత ఉంది, ఎప్పటికీ పూర్తవుతుంది? అనే విషయాలకి ఇద్దరి మధ్య క్లారిటీ ఉంటుంది.

ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి

ఇక ఎమర్జెన్సీ కోసం కూడా కొంచెం డబ్బు పక్కన పెట్టుకుంటే ఉత్తమం.ప్రస్తుతం ఉన్న ఉద్యోగం పోవచ్చు లేదా ఏదైనా విధంగా హాస్పిటల్ ఖర్చులు వచ్చి పడవచ్చు లేదా ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు అందుకే ప్రతినెలా కొంచెం డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్ గా పక్కన పెట్టుకోవడం మంచిది.

ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదు

ఇక భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని ప్రతి నిర్ణయం అతనే తీసుకోవాల్సిన అవసరం లేదు.భార్య ఎక్కువ సంపాదిస్తే ఆమెదే పెత్తనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.ఎవరి ఎక్కువ సంపాదిస్తున్నారనే దానికంటే ఇద్దరు కలిసి తమ కుటుంబాన్ని ఇలా నడిపించుకుంటున్నారు అనేది ముఖ్యం.

డబ్బు విషయంలో కలిసి ప్లాన్ చేసుకోవాలి

పెళ్లయ్యాక నీ డబ్బు నా డబ్బు అంటే ప్రతి విషయంలో గొడవలు రావడం పక్కా.సో ఇంటి ఖర్చులు, సేవింగ్స్, ఫ్యూచర్ నీడ్స్ ఇలా ప్రతిదీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవాలి.అపుడే డబ్బు విషయంలో భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు రావు మరి ఈ టిప్స్ పాటించి ఎలాంటి గొడవలు పడకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు కదూ!

Tags

Related News

తరచూ పనీర్ తింటున్నారా? అయితే ‘అనలాగ్ పనీర్’ గురించి తప్పక తెలుసుకోండి!

క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..

బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!

తేనెటీగ లేదా కందిరీగలు గుంపు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి

ఆఫీస్ లేదా కాలేజీలో పీరియడ్స్ మరకలు అంటుకుంటే ఏం చేయాలి? మీ బ్యాగులొ ఈ కిట్ ఉంటే సమస్యకు చెక్

రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

పరమసుందరి.. ఈ 3 రాశుల అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కలిగిన అందగత్తెలు

Big Stories

Advertisement
×