Dry hands in winter: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం తేమను కోల్పోయి పొడిబారి పోతుంది. ముఖ్యంగా చర్మంపై ఎంత శ్రద్ధ పెట్టినా,ముఖం, చేతులు మాత్రం త్వరగా గరుకుగా మారి పగిలిపోతుంటాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే ఖరీదైన లోషన్లు, క్రీములు వాడితే.. అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటి? చలికాలంలో.. మీ చేతులను ఎల్లప్పుడూ మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది చలి కాలంలో వేడి వేడి నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుంటారు. దీని వల్ల చర్మంలోని.. సహజ నూనెలు ఆవిరైపోయి చేతులు మరింత పొడిగా మారతాయి. అందుకే చేతులు కడుక్కునేటప్పుడు.. ఎప్పుడూ గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిది.
రాత్రి పడుకునే ముందు కొద్దిగా.. ఆలివ్ ఆయిల్, బాదం నూనె లేదా కొబ్బరి నూనెను చేతులకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. నూనె చర్మంలోకి.. ఇంకి పోయి, రాత్రంతా.. తేమను అందిస్తుంది. ఇలా చేయడం వల్ల ఉదయానికి మీ చేతులు చాలా మృదువుగా మారుతాయి.
తేనె, మీగడ లేదా పాలు కలిపి చేతులకు ..ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత.. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తేనె ఒక మంచి మాయిశ్చరైజర్ లా పని చేసి, డ్రై నెస్‌ను పూర్తిగా తొలగిస్తుంది.
గ్లిజరిన్, కొద్దిగా.. రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఒక బాటిల్‌లో.. నిల్వ ఉంచుకోవాలి. రోజూ రాత్రి పూట దీన్ని.. చేతులకు రాసుకుంటే పగిలిన చర్మం త్వరగా నయమవుతుంది. అంతే కాకుండా చేతులు కాంతివంతంగా మారుతాయి.
చలికాలంలో ..దాహం వేయకపోవడంతో.. చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. దీని వల్ల శరీరం డీహైడ్రేట్ అయి చర్మం పగిలిపోతుంది. రోజులో కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం ద్వారా చర్మానికి లోపలి నుంచి తేమ అందుతుంది. అంతే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది.
Also Read: డ్రాగన్ ఫ్రూట్ తింటే చర్మానికి ఇన్ని ప్రయోజనాలా? రోజూ ఇలా తినండి
6. గ్లౌవ్స్ వాడకం:
ఇంట్లో బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటి పనులు చేసేటప్పుడు డిటర్జెంట్లు, సబ్బులు చేతులకు నేరుగా.. తగలకుండా రబ్బరు గ్లౌవ్స్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. కెమికల్స్ వల్ల చేతులు గరుకుగా మారకుండా ఇవి కాపాడతాయి.
వారానికి ఒక సారి తేనె,పంచదార కలిపిన మిశ్రమంతో.. చేతులను సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త చర్మం మెరిసేలా చేస్తుంది.తరచూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్ కాకుండా ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే మంచిది.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం.. ద్వారా చలికాలంలోనూ ..మీ చేతులు ఎప్పుడూ మృదువుగా, అందంగా ఉంటాయి. ఖరీదైన ప్రొడక్ట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇంట్లోనే మీ చేతులను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు!