BigTV English

Anand Eye Hospital Incident: పాపం చిన్నారి.. కంటిలో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణం తీసేశారు

Anand Eye Hospital Incident: పాపం చిన్నారి.. కంటిలో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణం తీసేశారు

Anand Eye Hospital Incident: హైదరాబాద్‌లోని ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. సినీ పక్కీలో ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం బయటపడింది. కంటిలో నలుసు పడిందని ఐదేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నలుసు తీసేయాలంటే సర్జరీ చేయాలని మొదట వైద్యులు చెప్పారు. సర్జరీ చేసేముందు చిన్నారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రులకు తెలియకుండానే అన్వికను ఎల్బీనగర్ రెయిన్ బో హాస్పిటల్ తరలించారు. అయితే.. అప్పటి ఆమె చనిపోయిందని రెయిన్ బో హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దీంతో.. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఓ హాస్పిటల్ నిర్వాకం తల్లిదండ్రుల కడుపుకోత మిగిల్చింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వారి నిర్లక్ష్యం వల్ల రోగుల ప్రాణాలు తీస్తున్నారు. హాస్పటల్‌కి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సర్జరీలు అంటే జాగ్రత్తగా వ్యవహరించాలి.. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రి నిర్వాకం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఐదేళ్ల చిన్నారి కంట్లో నలుసు పడి కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతుండడంతో.. దగ్గర్లో ఉన్న ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. పాపని పరిశీలించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి ఆ నలకను తీసివేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్లు ఇంటికి వెళ్లి ఆపరేషన్‌కి సంబందించిన డబ్బులన్ని సమకూర్చుకుని శుక్రవారం 12 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లారు. పాపని ఆపరేషన్ సంబంధించి అన్ని పరీక్షలు చేసి.. థియోటర్‌కి తీసుకెళ్ళారు.


Also Read: హైదరాబాద్ లో ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ నాయకులు

ఎంత సేపు చూసిన ఆపరేషన్‌ అయిన తర్వాత పాపను చూపించకపోవడంతో.. తల్లిదండ్రులకి అనుమానం వచ్చి హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించాగా.. మీ పాప లేదు చనిపోయిందని చెప్పారు. పాప ఆపరేషన్‌కి సంబంధించి మత్తు మందు అధిక మోతాదులో ఇవ్వడం వల్లనే పాప మరణించిందని.. ఒక వేళ పాప బ్రతికే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడినుంచి రెయిన్‌బో ఆస్పత్రికి తరలించామని.. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో తమ పాప తమకు కావాలంటూ హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×