Mirror Cleaning: మన ఇళ్లలో అద్దాలను ఉపయోగిస్తాము. కొందరు ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలను కూడా వాడుతుంటారు. ఇవి కాలక్రమేణా మురికిగా మారతాయి. అందుకే ఎప్పటికప్పుడు అద్దాలను శుభ్రం చేయడం అవసరం. ఇందుకోసం మార్కెట్లో అనేక రకాల క్లీనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇవి చాలా ఖరీదైనవి కూడా. ఇదిలా ఉంటే అద్దాలను శుభ్రం చేయడానికి చాలా సులభమైన, చౌకైన మార్గం నిమ్మకాయను ఉపయోగించడం.
నిమ్మకాయలు అద్దాలను శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. నిమ్మ కాయలు అద్దంపై ఉండే ధూళి, నూనె, నీటి మరకలను శుభ్రం చేయడంలో సహాయపడే సహజ ఆమ్లాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా అవి తాజా, సిట్రస్ సువాసనను వదిలివేస్తాయి. అందుకే ఇవి కఠినమైన రసాయన ఆధారిత క్లీనర్ల కంటే మెరుగైన ఎంపికగా పరిగణించబడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నిమ్మకాయలను అద్దం క్లీన్ చేయడానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ, నీటితో స్ప్రే :
అద్దాలను శుభ్రం చేయడానికి.. నిమ్మరసం, నీటిని ఉపయోగించి ఒక స్ప్రే తయారు చేయవచ్చు. నిమ్మరసం మురికిని శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా తాజా వాసనను కూడా అందిస్తుంది.
ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసం పిండి వేయండి. ఇప్పుడు దానిని స్ప్రే బాటిల్‌లో సుమారు 2 కప్పుల నీటిలో వేసి కలపండి. తర్వాత మురికిగా ఉన్న అద్దం మీద స్ప్రే చేయండి. తర్వాత పాత కాటన్ క్లాత్‌తో తుడవండి.
నిమ్మరసం, బేకింగ్ సోడాపేస్ట్ :
బేకింగ్ సోడాను నిమ్మరసంతో కలిపిన పేస్ట్ మురికిని శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించడానికి.. మీకు సగం నిమ్మకాయ, బేకింగ్ సోడా , తడిగా ఉన్న క్లాత్ అవసరం అవుతాయి. నిమ్మకాయ కోసిన భాగంలో కొంచెం బేకింగ్ సోడా చల్లుకోండి. ఇప్పుడు నిమ్మకాయను నేరుగా అద్దం మీద రుద్దండి. ముఖ్యంగా మొండి మరకలపై రుద్ది కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత తడి క్లాత్‌తో తుడవండి.
నిమ్మ, వెనిగర్‌తో శుభ్రపరచడం:
వెనిగర్ మురికిని తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.. నిమ్మకాయ కూడా అద్దంపై ఉన్న మరకలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అలాగే వెనిగర్ వాసనను కప్పివేస్తుంది. వీటిని ఉపయోగించడానికి, నిమ్మరసం, వెనిగర్ లను తగిన మోతాదులో తీసుకుని వీటిని ని స్ప్రే బాటిల్‌లో కలపండి తర్వాత ఇందులో తగినంత నీరు పోసి మిక్స్ చేయండి. ఈ ద్రావణాన్ని అద్దం మీద స్ప్రే చేసి.. మెత్తటి క్లాత్‌తో తుడవండి. ఈ విధంగా మీరు అద్దాన్ని చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో శుభ్రం చేయవచ్చు.
Also Read: సమ్మర్‌లో ఫేస్‌కి ఈ ఒక్కటి వాడితే.. రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు !
నిమ్మ తొక్కలు:
నిమ్మ తొక్కను పనికిరానిదిగా భావించి బయట పాడేస్తారు. అయితే మీరు దీని సహాయంతో అద్దాన్ని కూడా శుభ్రం చేయవచ్చు. నిమ్మ తొక్కలోని నూనెలు అద్దానికి కొత్త మెరుపును ఇస్తాయి. దీని కోసం.. నిమ్మ తొక్కలోని మెత్తని , లోపలి భాగాన్ని అద్దంపై రుద్దండి. తర్వాత దానిని శుభ్రమైన పొడి క్లాత్ తో తుడవండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే అద్దం తెల్లగా మారుతుంది.