Sikandar: ఒక సీనియర్ హీరో.. ఒక యంగ్ హీరోయిన్‌తో జోడీకట్టాడంటే చాలు.. అప్పుడే ఆ సినిమాపై, ఆ పెయిర్‌పై ట్రోల్స్ మొదలయిపోతాయి. అంతే కాకుండా ఆ మూవీపై ఎలాగైనా నెగిటివిటీ పెంచాలని చూస్తారు కొందరు ప్రేక్షకులు. ప్రస్తుతం సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. మామూలుగా సల్మాన్ సినిమా అంటే బాలీవుడ్‌లో విపరీతమైన బజ్ ఉంటుంది. అలాగే ‘సికందర్’ సినిమాకు కూడా ఉంది. కానీ తన మునుపటి సినిమాలకు, ఈ సినిమాకు పెద్దగా తేడా కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మెల్లమెల్లగా తగ్గిపోతోంది. అంతే కాకుండా తాజాగా ఈ సినిమాపై కాపీరైట్ ఆరోపణలు మొదలయ్యాయి.
కాపీ కొట్టారు
తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘సికందర్’ (Sikandar). ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి దీనిపై మొదటి నుండే ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. కానీ ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలయిన తర్వాత అందరిలో ఆసక్తి చాలావరకు తగ్గిపోయింది. ఇలా కథను ముందే చాలా సినిమాల్లో చూశామని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. టీజర్, ట్రైలర్‌లో యాక్షన్ తప్పా ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో అంతా రొటీన్ అని చాలావరకు ఫిక్స్ అయిపోయారు. ఇక ఇందులో సల్మాన్ ఖాన్, రష్మిక మందనా పెయిర్‌పై కూడా ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి. దాంతో పాటు తాజాగా కొత్త సమస్య మొదలయ్యింది.
సేమ్ టు సేమ్
సల్మాన్ ఖాన్ (Salman Khan), రష్మిక మందనా (Rashmika Mandanna) స్టెప్పులేసిన ‘జోహ్రా జబీన్’ (Zohra Jabeen) అనే పాట కొన్నిరోజులు క్రితం విడుదలయ్యింది. ఆ పాట విడుదలయినప్పటి నుండి అసలు సల్మాన్, రష్మిక పెయిర్ ఏ మాత్రం బాలేదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ పాట వల్ల మూవీ టీమ్‌కు తాజాగా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. 2023లో విడుదలయిన ఒక బంగ్లాదేశీ పాటతో ఈ పాటకు పోలికలు ఉన్నాయని నెటిజన్లు గ్రహించారు. మ్యూజిక్ మాత్రమే కాదు.. హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్, స్టెప్స్‌తో సహా ఆ పాటకు, ఈ పాటకు చాలా పోలికలు ఉన్నాయని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో కాసేపట్లోనే వైరల్ అవుతోంది. దీంతో పాటను కాపీ కొట్టారంటూ ఆరోపణలు మొదలయ్యాయి.
Also Read: రష్మికకు, ఆమె తండ్రికి ఆ ప్రాబ్లం లేదు.. మీకెందుకు? సల్లూ భాయ్ సీరియస్..
ఫ్యాన్స్ సపోర్ట్
ఇప్పటికే ‘సికందర్’పై రోజురోజుకీ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది. ఇక ఇదే సమయంలో ఇలాంటి కాపీరైట్ ఆరోపణలు వస్తే అసలు ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారా అనే అనుమానాలు ఎక్కువయపోతున్నాయి. ఏం జరిగినా కూడా భాయ్ ఫ్యాన్స్ మాత్రం తనను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రావాలన్నా, సినిమా హిట్ కావాలన్నా ప్రేక్షకుల మౌత్ టాక్ కూడా చాలా ముఖ్యం. ఇక తాజాగా ‘జోహ్రా జబీన్’ పాట కాపీ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఒరిజినల్ వర్షన్ అయిన బంగ్లాదేశీ పాటనే చాలా బాగుందంటూ ప్రేక్షకులు వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం కూడా మొదలుపెట్టారు.
Bangladeshi gaane ko chori krke copy kr leta hoon kisi kya hi pta chalega ..bc kapda tak copy hai 🤣🤣😭😭#ZohraJabeen #Sikandar 🤣 #gay pic.twitter.com/zVCECln6SY
— Mai khama kha 3.O (@khamakha_3) March 21, 2025