Miss World Suchata: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ -2025 పోటీలు అత్యంత అంతరంగ వైభవంగా జరిగాయి. ఫైనల్‌లో థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాతా విజేతగా నిలిచింది. వివిధ ఖండాలకు చెందిన అందగత్తెలను వెనక్కి నెట్టేసి మిస్‌వరల్డ్ కిరీటాన్ని ఎగురేసుకుపోయింది. ఇకపై ఆ బ్యూటీ అందిన, అందనున్న బెనిఫిట్ అన్నీ ఇన్నీకావు. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్-2025 పోటీలు వైభవంగా జరిగాయి. దాదాపు మూడు వారాలపాటు వివిధ వర్గాలను ఆయా పోటీలు అలరించాయి. ఆది నుంచి చివరకు ఎవరు విజేత అన్నవిధంగా సాగింది. 108 దేశాల నుంచి ముద్దుగుమ్మలు ఇందులో పాల్గొన్నారు. వారందర్నీ అధిగమించి మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎగురేసుకుపోయింది థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ.
గతేడాది మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిజ్‌కోవా చేతుల మీదుగా సుచాతా కిరీటం ధరించింది. అయితే విజేత సుచాతా చువాంగ్‌శ్రీకి ఎనిమిదిన్నర (రూ. 8.5) కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. విజేతగా నిలిచిన మిస్ థాయ్ బ్యూటీ ఓపల్ సుచాతా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రైజ్‌మనీతోపాటు వజ్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతం. వీటి కంటే అంతర్జాతీయ ఖ్యాతి, గుర్తింపు లభించాయి.
ఏడాది వరకు సుచాతా పేరు మార్మోగనుంది. పేరు మోసిన విలువైన బ్రాండ్లు అంబాసిడర్‌గా కొనసాగనుంది. కేవలం మోడల్‌గానే కాకుండా నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా అనేక అవకాశాలను దక్కనున్నాయి. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ కార్యక్రమంలో భాగంగా మిస్ వరల్డ్ సంస్థ తరపున ఓసారి ప్రపంచమంతా ఉచితంగా తిరిగేయవచ్చు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో ఆమె కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది.
ALSO READ: 16 ఏళ్లకే క్యాన్సర్, ఇప్పుడు మిస్ వరల్డ్ సక్సెస్ వెనుక
ఏడాది వరకు ఓపల్ సుచాతాకు లగ్జరీ లైఫ్ కొనసాగనుంది. ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు నిత్యం ఆమె వెంట అందుబాటులో ఉంటారు. ఇక ఖరీదైన మేకప్ కిట్లు, డ్రెస్సులు, ఆభరణాలు వంటివి ఉచితంగా లభించనున్నాయి. మిస్ వరల్డ్ ఎక్కడికెళ్లినా గట్టి భద్రత ఉండనుంది.
సుచాతా అందుకున్న కిరీటం విలువ సుమారు 85 లక్షల రూపాయలు. 1770 వజ్రాలతో పొదిగిన కిరీటంలో ప్రతి అణువు ప్రపంచ సుందరీమణుల ప్రాముఖ్యతను, మహిళా శక్తిని స్పష్టంగా అందులో కనిపిస్తాయి. ప్రస్తుతం సుచాతా అందుకున్న కిరీటం ఎప్పటికీ ఆమె సొంతం కాదు.
వచ్చే ఏడాది పోటీల్లో అప్పుడు విజయం సాధించే యువతికి ప్రస్తుత మిస్ వరల్డ్ స్వయంగా కిరీటం ధరించాలి. కిరీటం ధరించే అవకాశం వాళ్లకు మాత్రమే దక్కనుంది. ప్రస్తుత విజేతకు కిరీటానికి సంబంధించి ప్రతిరూపాన్ని మాత్రమే అందజేస్తారు. అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముద్దుగుమ్మలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.