Big TV Kissik Talks:మానస్ నాగులపల్లి (Manas Nagulapalli).. నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’ సినిమాతో బాలనటుడిగా కెరియర్ మొదలు పెట్టిన మానస్.. ఈ సినిమాతో అద్భుతమైన నటన కనబరిచి నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తరువాత వీడే, అర్జున్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. కొంతకాలం చదువుపై దృష్టి సారించి, బీటెక్ పట్టా అందుకొని మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా 2011లో రవిశర్మ (Ravi Sharma) దర్శకత్వంలో వచ్చిన ‘ఝలక్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మానస్.. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా నటించి, బుల్లితెరపై అడుగులు వేశారు. అక్కడ పలు సీరియల్స్ తో మెప్పించిన మానస్ ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో హీరోగా కొనసాగుతున్నారు.
అందుకే మానస్ హోస్టింగ్ మానేశారా..?
ఇదిలా ఉండగా మానస్ చైల్డ్ ఆర్టిస్టు, హీరో, సీరియల్ హీరో మాత్రమే కాదు హోస్ట్ కూడా.. ఈ విషయం చాలామందికి తెలియదు అనే చెప్పాలి. గతంలో మానస్ హోష్టుగా చేసిన ఆ షోలు భారీ సక్సెస్ కూడా అందుకున్నాయి. మరి అంత పాపులారిటీ అందుకున్న మానస్.. ఇప్పుడెందుకు హోస్టుగా చేయడం లేదు అనే ప్రశ్న ఎదురవగా.. దానిపై క్లారిటీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ వర్ష(Jabardast Varsha) హోస్ట్ గా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్కిక్స్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు మానస్ నాగులపల్లి. ఇందులో భాగంగానే ఒకప్పుడు మీరు షో లో హోస్ట్ గా చేసిన షోలు భారీ సక్సెస్ అయ్యాయి. మరి ఎందుకు ఇప్పుడు చేయడం లేదు. ఒకవేళ మీరు కావాలని అవాయిడ్ చేస్తున్నారా? లేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అని ప్రశ్నించగా హోస్టింగ్ పై తన మనసులో మాటను బయటపెట్టారు.
హోస్టింగ్ పై మానస్ షాకింగ్ కామెంట్స్..
మానస్ పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రముఖ బుల్లితెర ఛానల్ జీ తెలుగు కోసం ‘రాజా vs రాణి’ అనే మ్యూజికల్ గేమ్ షో కి హోస్టుగా చేశారు. ఆ తర్వాత ‘డాన్స్ ఐకాన్’ అనే కార్యక్రమానికి కూడా ఆతిథ్యం వహించారు. అంతేకాదు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఐపీఎల్ 2024 కోసం కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఈ విషయంపై వర్షా ప్రశ్నిస్తూ.. ఇప్పుడెందుకు హోస్ట్గా చేయడం లేదు? అని ప్రశ్నించగా..” గతంలో నేను హోస్ట్ గా చేసిన కార్యక్రమాలు బాగా సక్సెస్ అయ్యాయి. అయితే ఇప్పుడు పెయిరింగ్ సిస్టం వచ్చింది. అది మనకు సెట్ అవ్వడం లేదు” అని మానస్ అన్నారు. దీపిక ఉంది కదా మీకు జోడిగా అని ప్రశ్నించగా.. దీపికతో అసలే వద్దు. నేను హోస్టింగ్ చేస్తే ఆమె ఇంకో కథలోకి వెళ్ళిపోతుంది. అది అసలుకే సెట్ అవ్వదు అంటూ మానస్ సరదాగా కామెంట్లు చేశారు. ఇకపోతే మానస్ మాట్లాడుతూ.. ముఖ్యంగా జంటలుగా హోస్టింగ్ చేయడం నాకు నచ్చదు. అందుకే ప్రస్తుతానికి ఆ పెయిరింగ్ సిస్టం వల్లే హోస్టింగ్ ఆపేశాను. హోస్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఒక ఫ్యాషన్ కూడా.. అయితే ఒక సరైన షో కోసం ఎదురు చూస్తున్నాను. వస్తే మాత్రం కచ్చితంగా మళ్ళీ హోస్ట్గా చేస్తాను అంటూ మానస్ తన మనసులో మాటగా చెప్పుకొచ్చారు. మరి ఈవెంట్ నిర్వాహకులు ఏదైనా ఒక షో మానస్ కోసం ప్లాన్ చేస్తారేమో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Big TV Kissik Talks: వామ్మో మానస్ టాలెంట్ చూశారా.. బాలయ్యతో ఛాన్సే కాదు అంతకుమించి..!