Munagaku rice recipe: ప్రస్తుతం తక్కువ టైంలో హెల్తీ ఫుడ్ తయారు చేసుకుని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికోసమే ఈ రెసిపీ. సాధారణంగా మునగాకుతో పప్పు లేదా చారు తయారు చేసుకుని తింటుంటారు. కానీ ఇలా రైస్ చేస్తే లంచ్ బాక్సులోకి అదిరిపోతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే మునగాకును సరైన పద్దతిలో వండితే మొఖం చిట్లేసే వారు కూడాలొట్టలేసుకుంటూ తింటారు.అంత రుచిగా ఉంటుంది. తక్కువ టైంలోనే రెడీ అయ్యే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లేత మునగాకు- ఒకటిన్నర కప్పులు
వండి చల్లార్చుకున్న అన్నం- ఒకటిన్నర కప్పులు
నెయ్యి లేదా వంట నూనె-రెండు టేబుల్ స్పూన్లు
తాలింపు గింజలు-తగినంత
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు నుంచి ఐదు
పసుపు- చిటికెడు
నువ్వుల పొడి- 1 టేబుల్ స్పూన్
ఉప్పు,- తగినంత
నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
మునగాకు రైస్ అంటే.. చాలామంది భయపడేది దీని చేదు గురించే. అయితే.. ముందుగా మునగాకును బాగా కడిగి నీరు పూర్తిగా పోయేలా జల్లెడలో వేయాలి. తర్వాత తాలింపులో ఆకు వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు మాడేలా వేయించకూడదు. మీడియం ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది. అలాగే చివర్లో కొద్దిగా నిమ్మరసం లేదా పల్లీల పొడి వేస్తే రుచి మరింత బ్యాలెన్స్ అవుతుంది.
Also Read: బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!
1. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. తర్వాత..తరిగిన పచ్చి మిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును ప్యాన్‌లో వేసి, ఇప్పుడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఆకు మెత్తబడి, పచ్చి వాసన పోయే వరకు రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. మునగాకు మరీ డ్రై అవ్వకుండా జాగ్రత్త పడాలి.
2.తర్వాత పొడి పొడిగా ఉన్న అన్నం వేసి నెమ్మదిగా కలపాలి. దీనిని లో-ఫ్లేమ్‌లో మరో రెండు నిమిషాలు వేడి చేయాలి. చివర్లో కాస్త నిమ్మరసం, కొద్దిగా పల్లీ/నువ్వుల పొడి చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన మునగాకు అన్నం రెడీ అవుతుంది.
ఈ రెసిపీ లంచ్ బాక్స్, డిన్నర్ దేనికైనా చాలా రుచిగా ఉంటుంది. దీని పక్కన పెరుగు లేదా అప్పడం కంబినేషన్ నెక్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సింపుల్ అండ్ టెస్టీగా ఉండే.. ఈ రెసిపీ ఈ సారి తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి.