E-Paper
Advertisement

మనసులో నిరాశ, బాధ, గందరగోళంగా ఉందా? ప్రతి సమస్యకు పరిష్కరం సూచించే భగవద్గీత అధ్యాయాలు ఇవే

మనసులో నిరాశ, బాధ, గందరగోళంగా ఉందా? ప్రతి సమస్యకు పరిష్కరం సూచించే భగవద్గీత అధ్యాయాలు ఇవే
Advertisement

Bhagvadgita Teachings| జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు, బాధలు, నిరాశ ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఏం చేయాలో అర్థంకాక మనసు గందరగోళానికి గురవుతుంది. అలాంటి సమయంలో మనకు సరైన మార్గం చూపించే ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతా బోధనలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా 7 నుంచి 12వ అధ్యాయాలు భక్తి, విశ్వాసం, ఆత్మజ్ఞానం, జీవిత సత్యాల గురించి విలువైన విషయాలను వివరిస్తాయి.

మాయ నుంచి బయటపడే మార్గం వివరించే 7వ అధ్యాయం

భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. ఇందులో శ్రీకృష్ణుడు మాయ గురించి వివరిస్తాడు. డబ్బు, ఆస్తులు, బంధాలు, సుఖాలపై అతిగా ఆశపడటం మనిషిని నిజమైన జ్ఞానానికి దూరం చేస్తుంది. భగవంతుడిపై నిజమైన భక్తి, నమ్మకం ఉంటే ఈ మాయను అధిగమించవచ్చని శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవితంలో శాశ్వతమైన విలువలను గుర్తించాలని ఈ అధ్యాయం బోధిస్తుంది.

భగవంతుడిని నిరంతరం స్మరించాలి.. 8వ అధ్యాయం

Advertisement

8వ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మ యోగం అంటారు. ఇందులో జీవితం, మరణం, ఆత్మ గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మనిషి జీవితాంతం భగవంతుడిని స్మరించాలని చెబుతాడు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ భక్తితో ఉండాలని సూచిస్తాడు. శరీరం నశించినా ఆత్మకు మరణం లేదనే విషయాన్ని ఈ అధ్యాయం గుర్తుచేస్తుంది.

9వ అధ్యాయం నిజమైన భక్తికి ప్రాధాన్యం

తొమ్మిదవ అధ్యాయాన్ని రాజవిద్యా రాజగుహ్య యోగంగా పిలుస్తారు. ఖరీదైన పూజలు, కానుకల కంటే స్వచ్ఛమైన మనసుతో చేసే భక్తినే దేవుడు కోరుకుంటాడని కృష్ణుడు చెబుతాడు. ప్రేమతో సమర్పించే ఆకు, పువ్వు, పండు లేదా నీటిని కూడా స్వీకరిస్తానని వివరిస్తాడు. మన పనులను నిజాయతీగా చేసి, వాటి ఫలితాలను భగవంతుడికి అర్పించాలని ఈ అధ్యాయం బోధిస్తుంది.

Advertisement

Also Read: భగవద్గీత.. జీవితంలో ఎదగాలంటే ఈ 3 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

10వ పదవ అధ్యాయం భగవంతుడి దివ్యశక్తిని తెలియజేస్తుంది

విభూతి యోగంగా పిలిచే పదవ అధ్యాయం భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తుంది. ప్రకృతిలోని అందమైన, శక్తివంతమైన ప్రతి అంశంలో దైవశక్తి ఉందని శ్రీకృష్ణుడు చెబుతాడు. పర్వతాలు, నదులు, ప్రకృతి, గొప్ప వ్యక్తులు ఆయన శక్తికి ప్రతిరూపాలని వివరిస్తాడు.

11వ అధ్యాయం విశ్వరూప దర్శనాన్ని చూపిస్తుంది

విశ్వరూప దర్శన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ రూపంలో సృష్టి, స్థితి, లయం కనిపిస్తాయి. భగవంతుడి శక్తి అపారమని, మనిషి జ్ఞానానికి అందనంత విశాలమైనదని ఈ అధ్యాయం తెలియజేస్తుంది.

Also Read: మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

12వ అధ్యాయం నిజమైన భక్తుడి లక్షణాలను వివరిస్తుంది

భక్తి యోగంగా పిలిచే పన్నెండవ అధ్యాయం నిజమైన భక్తి గొప్పతనాన్ని వివరిస్తుంది. ప్రేమతో, విశ్వాసంతో దేవుడిని ఆరాధించడం సులభమైన ఆధ్యాత్మిక మార్గమని శ్రీ కృష్ణ భగవానుడు డు చెబుతాడు. నిజమైన భక్తుడు అహంకారం, ద్వేషం లేకుండా ఉంటాడు. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. అందరి మంచిని కోరుకుంటూ దయ, శాంతితో జీవిస్తాడు.

భగవద్గీతలోని ఈ 6 అధ్యాయాలు మనిషికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. కష్టాల్లో ధైర్యంగా ఉండటం, భక్తితో జీవించడం, ఇతరుల పట్ల దయ చూపించడం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సూచిస్తాయి. మన కర్తవ్యాన్ని నిజాయతీగా నిర్వర్తిస్తూ, మంచి ఆలోచనలతో ముందుకు సాగడమే గీత అందించే ముఖ్యమైన సందేశం.

Related News

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి మంచి డ్రెస్ కావాలా? అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్టైలిష్ అవుట్‌ఫిట్స్ చూడండి

ఎక్కువ కష్టపడకుండా నడకతోనే వారంలో కిలో బరువు తగ్గించే సింపుల్ ఫార్ములా ఇదే!

ఖరీదైన క్లీనర్లతో పనిలేదు.. ఇంట్లో ఉండే ఈ ఒక్క లిక్విడ్ చాలు, బాత్రూమ్ కొత్తదానిలా మెరిసిపోతుంది!

ఫైబర్ పుష్కలంగా ఉండే స్పెషల్ ఉప్మా.. చలికాలంలో సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌

భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది

పాకెట్ మనీ అస్సలు ఖర్చు పెట్టరు.. ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు పుట్టకతోనే ‘ఫైనాన్షియల్ జీనియస్’sr

మీ కళ్లు చిన్నవిగా కనిపిస్తున్నాయా? పెద్దవిగా కనిపించేందుకు 3 ఫర్ఫెక్ట్ ఐలైనర్ ట్రిక్స్

Big Stories

Advertisement
×