BigTV English

Mosquitoes : దోమలు లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా..?

Mosquitoes : దోమలు లేని ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా..?

Mosquitoes


Mosquitoes : భూమి మీద మనుషులతో పాటు రకరకాల జంతువులు, దోమల జాతులు కూడా జీవిస్తున్నాయి. అయితే కొన్నిరకాల దోమలు మనిషిని కుట్టవు. ఇలాంటి జాతుల దోమలు ఏం తిని జీవిస్తాయిని అనుకుంటున్నారా? ఆ దోమ జాతులు ఏం తింటాయంటే.. పండ్లు, మొక్కల జిగురు వంటివి తాగుతాయి. మీకు తెలుసా భూమిపై ఉన్న దోమ జాతుల్లో ఆరు జాతుల మాత్రమే మన రక్తాన్ని తాగుతాయట.

ఈ దోమలు మన రక్తాన్ని తాగడమే కాకుండా కొన్నిరకాల వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. దేశంలో దోమల కుట్టడం ద్వారా ఏటా 10 లక్షల మంది చనిపోతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. దోమలు సాధారణంగా ప్రతిచోటా కనిపిస్తాయి. దోమలు కుట్టడం వల్ల జ్వరం నుంచి పలు రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.


Read More : ఒంటరి స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం.. మూడు నెలలు ఇలానే ఉంటే..!

దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్‌ వంటి వ్యాధులు వస్తాయి. దోమ కాటు వల్ల లక్షలాది మంది చనిపోతున్నారు. అసలు దోమలన్నింటినీ చంపేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

దోమలను చంపడానికి కొన్ని రకాల కెమికల్స్‌‌ను వాడటం మనమందరం చేసేఉంటాం. అయితే ఈ రసాయనాల వల్ల దోమల కంటే మనుషులకే ఎక్కువ ప్రమాదమట. దీన్ని గుర్తించిన పరిశోధకులు ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమలను అంతం చేసేందుకు కొన్ని ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనుషులను ఆడ దోమలు మాత్రమే కుడతాయి. ఈ దోమల్లోని జీన్‌లో మార్పులు తీసుకొచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్‌ దోమలను సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. దోమలు గుడ్లు పెట్టిన తర్వాత వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చేలోపే తల్లిదోమలు చనిపోతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్‌ ద్వీపంలో 2010 సంవత్సరంలో వదిలేశారు. దీని కారణంగా 96 శాతం వరకు దోమల బెడద తగ్గింది.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షల మంది మనుషుల ప్రాణాలను కాపాడుకోవచ్చు. జెనిటికల్లీ మాడిఫైడ్‌ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదని వారు చెబుతున్నారు.

Read More : స్లీప్ ఆప్నియా.. ఈ ఆహారాలతో గుడ్ బై చెప్పండి!

అయితే దోమలను మానవ ప్రపంచంలో లేకుండా నాశనం చేస్తే ‍ప్రకృతి అందించిన ఆహారపు గొలుసుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. దీని ద్వారానే పూలు పండ్లుగా మారుతున్నాయి.

అంతేకాకుండా కప్పలు, బల్లులు, తొండలు వంటి ప్రాణులకు దోమలు ఆహారంగా మారుతున్నాయి. అవి దోమలను తిని బతుకుతున్నాయి. దోమలు ఉండటం వల్లనే ప్రకృతి సమతుల్యత సాఫీగా జరుగుతోంది. అందుకే దోమలను అంతం చేయడం మానవ జాతికే ప్రమాదం.

Disclaimer : ఈ కథనాన్ని కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×