BigTV English

Depression : ఒంటరి స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం.. మూడు నెలలు ఇలానే ఉంటే..!

Depression : ఒంటరి స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం.. మూడు నెలలు ఇలానే ఉంటే..!

woman


Depression High In Separated Woman : మన జీవితాన్ని ఆనందంగా గడపడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం బావుండాలంటే జీవితంలో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. విహహం చేసుకుంటే మానసికంగా సంతోషంగా ఉండొచ్చని కొన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి. లేదంటే డిప్రెషన్ బారిన పడతారని అంటున్నారు. అయితే డిప్రెషన్‌కు పురుషులకంటే స్త్రీలలో అధికంగా గురవుతారని అంటున్నారు నిపుణులు.

ఒంటరిగా ఉండే స్త్రీలు ఎక్కువ ఒత్తిడి గురవుతారని ఇటీవలే ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పెళ్లైన కొత్తలో స్త్రీలు ఒత్తిడిని లోనవుతారు. పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భాగస్వామికి లేదా అత్తమామలు, తల్లిదండ్రులు నుంచి విడివిడిగా నివసించే మహిళల్లో డిప్రెషన్ ముప్పు ఎక్కువగా ఉంటుందట.


Read More : ఫిష్ పెడిక్యూర్.. యమ డేంజర్ గురూ..!

స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారి శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. శరీరంలో జరిగే ఈ హార్మోన్ల మార్పుల వల్ల చాలా మంది స్త్రీలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిన్లాండ్‌లోని హెల్సింకీ యూనివర్సిటీ అధ్యయనంలో వెలుగులోకి వచ్చాయి.

ఒక ఒక స్త్రీకి పెళ్లికి ముందు ఆమె జీవితంలో తన ఆమె తల్లిదండ్రులకు, ఆమెకు ఇష్టమైనవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పెళ్లి తర్వాత ఆమె తల్లిదండ్రులు కన్నా.. భర్త, అత్తమామలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం స్త్రీ భర్త లేదా తల్లిదండ్రులతో కలిసి జీవించడం వల్ల డిప్రెషన్‌ ప్రమాదం తగ్గుతుంది.

ఫిన్లాండ్‌లో 4.88 లక్షల మంది చిన్న పిల్లల తల్లులను పరిశోధనలు జరిపారు. తల్లులను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా అనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు, అత్తమామల వయస్సు, వారి ఆరోగ్యం వంటి అంశాలను తెలుసుకున్నారు. తల్లులతో వారి అనుబంధం ఎలా ఉందనే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్న తల్లులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.

ఫిన్లాండ్‌లోని హెల్సింకి యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ నినా మెట్సా-సిమోలా మాట్లాడుతూ.. ఉద్యోగం చేసే స్త్రీలకు పెళ్లి తర్వాత పిల్లలు పుడితే ఆలోచన మొత్తం వారిపై ఉంటుంది. దీనికి కారణంగా డిప్రెషన్‌కు గురవుతారు. పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి తల్లిదండ్రులు, అత్తా మామ ఉంటే ఎలాంటి ఒత్తిడికి గురికారని తెలిపారు.

Read More : పులిపిర్లు ఎందుకు వస్తాయి? .. వాటిని మాయం చేయడం ఎలా?

స్త్రీ బిడ్డకు జన్ననిచ్చే సందర్భంలో డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. భర్త నుంచి విడిపోయిన, ఒంటరిగా ఉంటే స్త్రీలలో మానసిక సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బిడ్డకు జన్ననిచ్చే సందర్భంలో డిప్రెషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిప్రెషన్ అనేది సాధారణ సమస్య అయినప్పటికీ.. శ్రద్ద అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి.

1975లో జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఆఫీసుల్లో పనిచేసే స్త్రీలు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇంట్లో పని చేసే స్త్రీలలో ఈ సమస్యలు ఉండవట. కొందరు స్త్రీలు ఇష్టపడిన వస్తువు పోగొట్టుకునన్న డిప్రెషన్‌కు గురి అవుతున్నారట. డిప్రెషన్ మూడు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగితే మానసిక వైద్యులను ఆలస్యం చేయకుండా సంప్రదించాలి.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు హెల్త్ జర్నల్స్ , నిపుణుల సూచనల మేరకు అందిస్తున్నాం.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×