Mothers Day Wishes 2025: చెప్పకుండానే ప్రతిదీ అర్థం చేసుకునేది ఈ ప్రపంచంలో అమ్మ మాత్రమే. అందుకే తల్లి’కి దేవునితో సమానమైన హోదా ఇవ్వబడుతుంది. ఒక తల్లి మాత్రమే తన బిడ్డ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తుంది. తన సొంత కోరికలను అణచివేసి పిల్లల కోరికలను తీర్చడం, తన సొంత అభిరుచులను మరచిపోయి పిల్లల ఎదుగుదలకు పాటు పడటం, ఎంత అలసిపోయినా కూడా పిల్లల కోసం కాదనకుండా అన్నీ చేస్తుంది. మనకోసం ఇన్ని చేసే అమ్మల కోసం మనం మే 11 న మదర్స్ డే రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా ?
1. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ,
ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ,
మహోన్నతమైన మాతృమూర్తులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !
2. అమ్మ గొప్పతనం తెలపడానికి భాష చాలడం లేదు
కానీ చెప్పాన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ
హ్యాపీ మదర్స్ డే !
3. అమావాస్య చీకటిలో నిండు
చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ
అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము
హ్యాపీ మదర్స్ డే !
4. అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..
హ్యాపీ మదర్స్ డే !
5. సృష్టిలో మనకు తొలి గురువు అమ్మ
తల్లిని మించిన దైవం లేదు
ఆమె త్యాగాలకు అంతులేదు
అమ్మకు శతకోటి వందనాలు
హ్యాపీ మదర్స్ డే !
6. ప్రేమ ఎవరినైనా పంచగలరు
కానీ అమ్మ ప్రేమను ఎవరూ మరిపించలేరు
హ్యాపీ మదర్స్ డే !
7. చిన్నప్పటి నుండీ ఏ లోటు
లేకుండా చేసుకున్న
నీకు ఏమి ఇచ్చినా తక్కువే అమ్మ
హ్యాపీ మదర్స్ డే !