Multani Mitti For Hair: మారుతున్న సీజన్ ప్రకారం జుట్టు సంబంధిత సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా సమ్మర్‌లో జుట్టు రాలడం, డ్రై హెయిర్ వంటి సమస్యలు చాలా సాధారణం. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. జుట్టుకు ముల్తానీ మిట్టిని వాడండి. ముల్తానీ మిట్టిలో కొన్ని రకాల పదార్థాలను కలిపి అప్లై చేయడం ద్వారా.. అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించవచ్చు. దీనితో పాటు.. మీరు పొడవాటి జుట్టు కోసం ముల్తానీ మిట్టిని కూడా ఉపయోగించవచ్చు. జుట్టు పొడవుగా పెరగడానికి ముల్తానీ మిట్టిని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్తానీ మిట్టి, అలోవెరా జెల్ హెయిర్ ప్యాక్:
అలోవెరా జెల్ తలకు కుదుళ్ల నుండి పోషణను అందిస్తుంది. ముల్తానీ మిట్టితో కలిపి దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు బలపడుతుంది. అంతే కాకుండా తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది.
ఇందు కోసం.. ముందుగా 2 చెంచాల కలబంద జెల్, 2 చెంచాల ముల్తానీ మిట్టి పొడిని కలపండి. దీనికి తగిన నీరు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ని మీ జుట్టుకు అప్లై చేసి 1 గంట పాటు అప్లై చేయండి. ఆరిన తర్వాత.. సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి.
ఈ ప్యాక్ మీ జుట్టును బాగా కండిషన్ చేస్తుంది. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.
ముల్తానీ మిట్టి, పెరుగు, నిమ్మరసం:
ఈ మూడు పదార్థాలన తగిన మోతాదుల్లో తీసుకుని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది.
రెండు చెంచాల ముల్తానీ మిట్టిని నాలుగు చెంచాల పెరుగు, ఒక చెంచా నిమ్మరసంతో కలపండి. దీంతో పాటు.. అర టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి.
దీన్ని మీ జుట్టుకు పూర్తిగా అప్లై చేయండి.దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి అరగంట పాటు ఉంచండి. ఆరిన తర్వాత.. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. దీనివల్ల జుట్టు మృదువుగా, బలంగా మారుతుంది.
ఇది జుట్టు నుండి చుండ్రును కూడా తొలగిస్తుంది. మీరు దీన్ని వారానికి రెండుసార్లు కూడా అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read: ద్రాక్ష పండ్లు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !
ముల్తానీ మిట్టి, పెరుగు, కరివేపాకు:
ఒక చెంచా ముల్తానీ మట్టి, రెండు చెంచాల పెరుగు కలిపి, దానికి తగిన మోతాదులో కరివేపాకు పేస్ట్ వేసి అప్లై చేయాలి. అన్నింటినీ బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. దీన్ని మీ జుట్టు, తలపై బాగా అప్లై చేయండి. జుట్టుపై దీనిని 30 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేయండి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ , ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును బలపరుస్తాయి. వారానికి రెండుసార్లు దీనిని అప్లై చేయడం ద్వారా.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల మీ జుట్టు మెరుస్తుంది. అంతే కాకుండా పొడవుగా కూడా మారుతుంది. దీన్ని అప్లై చేయడం ద్వారా మీరు చాలా త్వరగా తేడాను గమనిస్తారు.