BigTV English

NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?

NZ beat Pak: కివీస్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిన పాక్… పరువు మొత్తం పాయె ?

NZ beat Pak: పాకిస్తాన్ క్రికెట్ జట్టు తలరాత మారడం లేదు. ఆ జట్టు మరోసారి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణమైన ఆట తీరు తర్వాత పాకిస్తాన్ జట్టు.. వైట్ బాల్ ఫార్మాట్ లో సిరీస్ లు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్ళింది. కానీ అక్కడ కూడా పాకిస్తాన్ ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఐదు టి-20 మ్యాచ్ ల సిరీస్ ని 4-1 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.


Also Read: LSG Mentor Zaheer Khan: అన్నీ కుట్రలే..లక్నో పిచ్ పంజాబ్ క్యూరేటర్ తయారు చేసాడు ?

ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఓటమి దిశగానే ప్రయాణం సాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా ఈ మొదటి వన్డేలో ఏకంగా 43 ఎక్స్ట్రాలు ఇచ్చి ఓ చెత్త రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ ముందు 345 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ అజామ్ 57, అఘ సల్మాన్ 51 మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.


అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసిసి వారికి మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలో ఆర్టికల్ 2.22 ని ఉల్లంఘించినందుకు జట్టుకు ఈ జరిమానా విధించింది ఐసిసి. ఇక రెండవ వన్డే లోను న్యూజిలాండ్ చేతిలో ఏకంగా 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 41.2 ఓవర్లలో 208 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.

ఈ మ్యాచ్ లో ఫహీం అష్రఫ్ 73, నసీం షా 51 మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర, విలియమ్సన్, షాంట్నర్, కాన్వే, ఫర్గూసన్, ఫిలిప్స్, హెన్రీ, జమీసన్, లాథమ్, యంగ్, సౌథీ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఓడిపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాకిస్తాన్ ఇలా ఓడిపోవడం ఆ జట్టు మాజీ ఆటగాల్లను ఆవేదనకు గురిచేస్తుంది. ఈ ఓటమితో న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 12 వన్డేల్లో ఓడిపోయి పరువు తీసుకుంది పాకిస్తాన్.

 

అయితే రెండవ వన్డేలో న్యూజిలాండ్ బౌలర్లలో రైట్ ఆర్మ్ పేసర్ బెన్ సీర్స్ ఐదు వికెట్లతో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జేకబ్ డఫీ 3, నాథన్ స్మిత్, విలియం ఓరూర్కి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ హేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే బ్రేస్ వెల్ బృందం పాకిస్తాన్ పై వన్డే సిరీస్ గెలుపు నమోదు చేసుకుంది. ఇక ఈ ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 5వ తేదీన చివరి వన్డే జరగబోతోంది. ఈ చివరి వన్డేలోనైనా గెలుపొంది పరువు కాపాడుకోవాలని భావిస్తుంది పాకిస్తాన్.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×