E-Paper
Advertisement

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!
Advertisement

Tomato pickle recipe: చాలా మంది భోజనంలో పచ్చడి తప్పకుండా ఉండాల్సిందే. అందులోనూ టమాటో నిల్వ పచ్చడి ఉంటే వేడి వేడి అన్నంలో.. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే టమాటో పచ్చడి పెట్టాలంటే.. రోజుల తరబడి ఎండలో ఎండబెట్టాలని చాలా మంది భయపడుతుంటారు. కానీ ఎలాంటి ఎండతో పని లేకుండా, అచ్చం అమ్మమ్మల కాలం నాటి రుచితో, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా టమాటో పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు :

టమాటోలు: 1 కేజీ (దోరగా, గట్టిగా ఉన్నవి)

Advertisement

చింతపండు: 100 గ్రాములు

ఆవాలు: 3 టేబుల్ స్పూన్లు

Advertisement

మెంతులు: 1 టేబుల్ స్పూన్

ఉప్పు: 150 గ్రాములు

కారం: 150 గ్రాములు (రుచికి తగినట్లుగా)

పసుపు: 1 టీస్పూన్

వెల్లుల్లి రెబ్బలు: ఒక కప్పు (పొట్టు తీసినవి)

నూనె: 300 మి.లీ ( పల్లీ నూనె లేదా నువ్వుల నూనె)

పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ

తయారీ విధానం :

1. మొదటగా టమాటోలను బాగా కడిగి, తడి లేకుండా ఒక పొడి క్లాత్‌తో తుడవాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.టమాటోలలో తడి అస్సలు ఉండకూడదు. లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది.
తీసుకున్న చింత పండులో కొద్దిగా నీరు లేదా టమాటో.. ముక్కల్లోని జ్యూస్ తో ఉడికించి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి కట్ చేసుకున్న టమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి.. మెత్తగా ఉడికించాలి. టమాటోలోని నీరంతా ఇంకి పోయి గుజ్జులా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారాలి.

2. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి మెంతులు, ఆవాలను విడివిడిగా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఉడికించి చల్లార్చిన టమాటో గుజ్జును తీసుకోవాలి. అందులో.. ఆవపిండి, మెంతిపిండి, పసుపు, కారం , ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను అందులో కలపాలి. అనంతరం కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టాలి. పోపు పూర్తిగా.. చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో లేదా జాడీలో స్టోర్ చేసుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండానే చాలా రుచిగా ఉంటుంది.

Also Read: అల్లం పచ్చడి ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ ఉంటుంది,రుచి కూడా సూపర్!

జాగ్రత్తలు:

పచ్చడి తయారు చేసేటప్పుడు ఉపయోగించే గిన్నెలు, గరిటెలు తడి లేకుండా చూసుకోవాలి.

చేతులు తడిగా ఉన్నప్పుడు పచ్చడిని తీయకూడదు.

తగినంత నూనె పైకి తేలేలా చూస్తే పచ్చడి ఎప్పటికీ పాడవకుండా తాజాగా ఉంటుంది.

ఎలాంటి శ్రమ లేకుండా, ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ టమాటో నిల్వ పచ్చడి అద్భుతమైన రుచిని ఇస్తుంది. మీరు కూడా ఈ పక్కా కొలతలతో ఈ సారి టమాటో పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి.

Related News

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

చాణక్య నీతి.. ఇలా ఆలోచించేవారు మాత్రమే ధనవంతులు అవుతారు

భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు

భగవద్గీత.. జీవితంలో ఎదగాలంటే ఈ 3 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

పిల్లలతో కోపంగా మాట్లాడి మళ్లీ వారి మనసు గెలవాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఇది తప్పనిసరిగా పాటించాలి

Big Stories

Advertisement
×