Mustard Oil For Hair: పొడవాటి జుట్టు కావాలని.. ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు.. జుట్టురాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం ఒత్తిడి, బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, తినే ఆహారంలో మార్పులు కావచ్చు. ఇందుకోసం మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. అయినా ఫలితం సూన్యం. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఆవాల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ జుట్టు సంరక్షణకు చక్కగా పనిచేస్తాయి. ఆవాల నూనె జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆవాల నూనెలో వీటిని కలిపి తలకు పెట్టుకోండి. నడుము వరకు జుట్టు పెరగడం ఖాయం. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఆవాల నూనె
మందార పువ్వులు
కరివేపాకు
మందారం ఆకులు
ఉసిరి
లవంగాలు
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో రెండు కప్పులు ఆవాల నూనె, ఉసిరి ముక్కలు, మందారం పువ్వులు, కరివేపాకు, మందారం ఆకులు, లవంగాలు 4 వేసి.. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గాజు సీసాలో వడకట్టుకోవాలి. తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు పెట్టుకోవచ్చు. లేదా ఈ నూనెను తలకు అప్లై చేసి.. సుమాపు 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఆవాల నూనెతో ఈ చిట్కాలు కూడా పాటించండి.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి.
ఆవాల నూనె, పెరుగు హెయిర్ మాస్క్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో కావాల్సినంత ఆవాల నూనె, మూడు టేబుల్ స్పూన్ పెరుగు కలిపి తలకు పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు మెరిసేలా, మృదువుగా ఉండేలా చేస్తుంది.
ఆవాల నూనె, కలబంద హెయిర్ మాస్క్
చిన్న గిన్నెలో అరకప్పు ఆవాల నూనె తీసుకుని.. అందులో ఫ్రెష్ అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పెట్టుకుని.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు పొడవుగా, పెరగడంతో పాటు చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది.
ఆవాల నూనె నిమ్మరసం
ఆవాల నూనెను గిన్నెలోకి తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి.. జుట్టుకు 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా చేస్తే ముఖ్యంగా చుండ్రు సమస్యలు తగ్గిపోయి, జుట్టురాలడాన్ని తగ్గిస్తుంది.
ఆవనూనె, అరటిపండు హెయిర్ మాస్క్
చిన్న బౌల్ తీసుకుని అరకప్పు ఆవనూనె, బాగా పండిన అరటి పండు గుజ్జు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పెట్టుకుని.. అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగా పొడవుగా, సిల్కీగా ఉండేలా సహాయపడుతుంది.
Also Read: పాలతో రోజూ ఇలా చేస్తే.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.