BigTV English

Natural Gold Facial: ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్.. అందమైన చర్మం మీ సొంతం

Natural Gold Facial: ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్.. అందమైన చర్మం మీ సొంతం

Natural Gold Facial : ప్రతి ఒక్కరు ముఖం కళకళలాడుతూ.. మంచి కాంతివంతమైన చర్మం కోరుకుంటారు. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ.. వేలకు వేలు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గోల్డ్ ఫేషియల్స్ చేపించుకోవాలంటే.. సెలూన్‌కి వెళ్తే సుమారు రూ.3000 నుంచి, రూ.5000 వరకు ఖర్చు అవుతుంది. అలా కాకుండా మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో తయారు చేసుకున్న ఫేయల్స్‌తో ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా చేసుకోవచ్చు.. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్ -1
ముందుగా ఫేషియల్స్ చేసుకునే ముందు.. ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్‌లో పచ్చిపాలు తీసుకుని.. దూది లేదా కాటన్ క్లాత్ ముంచి ముఖానికి, మెడకు అప్లై చేస్తూ.. కొద్దిసేపటి వరకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మృత కణాలు, మలినాలు తొలగిపోయి తాజాగా మెరుస్తుంది.

స్టెప్-2
స్క్రబ్బింగ్ కోసం.. ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో పంచదార టీస్పూన్, తేనె టీ స్పూన్, నిమ్మరసం టీ స్పూన్, కలిపి మూడింటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.


స్టెప్ -3
పైన చెప్పిన రెండు ఫేస్ మాస్క్‌లు అప్లై చేసుకున్న తర్వాత.. వేడినీళ్ళ ఆవిరి పట్టండి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోండి.

స్టెప్ -4
చిన్న గిన్నె తీసుకుని.. అందులో టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ నిమ్మరసం, పెరుగు తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా కొద్ది నిమిషాల్లో చర్మం కాంతివంతంగా, మిలమిల మెరుస్తుంది. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.

గోల్డ్ ఫేసియల్స్ చేసుకోవడానికి.. ఇలా కూడా ట్రై చేయండి. చర్మం అందంగా మారుతుంది.

షుగర్, బొంబాయి రవ్వ, నిమ్మరసం, పాలు ఫేస్ ప్యాక్
సాధారణంగా బొంబాయి రవ్వను ఉప్మాలో ఉపయోగిస్తుంటారు. కానీ ఇది చర్మ సంరక్షణలో కూడా అద్భుతంగా పనిచేస్తుందట. బొంబాయి రవ్వ ముఖంపై ఉన్న మురికిని, దుమ్ము, ధూళి తొలగించడంలో సహాయపడుతుంది. ఇందు కోసం చిన్న గిన్నె తీసుకుని.. అందులో టీ స్పూన్ బొంబాయి రవ్వ, టీ స్పూన్ పంచదార, పచ్చిపాలు, టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి స్క్రబ్బింగ్ చేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

శెనగపిండి, పసుపు, ముల్తానీ మిట్టి, తేనె ఫేస్ ప్యాక్

చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ శెనగపిండి, పసుపు, ముల్తానీ మిట్టి, తేనె , నిమ్మరసం, పచ్చిపాలు తీసుకుని.. అన్ని ఇంగ్రీడియన్స్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మీ చర్మం తాజాగా, కాంతివంతంగా మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Also Read: అరగంట వాడితే చాలు.. రోజంతా చర్మం మెరుస్తూనే ఉంటుంది

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Oral Care: పళ్లు తోమకపోతే పోతారు.. తాజా స్టడీలో తేలింది ఇదే!

Loud Snoring: గురక పెట్టి నిద్రపోతున్నారా? అయితే మీరు ప్రమాదకరమైన వ్యాధి బారిన పడ్డట్లే !

Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

No Internet: ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు.. సోషల్ మీడియా లేదు.. ఇంకా పాత విధానాల్లోనే జీవిస్తున్న జనం!

Wi-Fi Radiation: వామ్మో.. వైఫై ఆఫ్ చేయకపోతే ఇంత ప్రమాదమా! మరి రాత్రంతా ఆన్‌లోనే ఉంటే?

Benefits of Swimming: స్విమ్మింగ్ చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా ? బాబోయ్..

Big Stories

×