Vaibhav Suryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం, ఐపీఎల్ 2025 సీజన్ లో సెంచరీ బాదిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీకు గుర్తుండే ఉంటాడు. టి-20 క్రికెట్ లో అతి పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా రికార్డ్ నెలకోల్పాడు వైభవ్ సూర్యవంశి. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యవంశీ కేవలం 35 బంతులలోనే అద్భుతమైన సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఇతడు భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Richest Cricket Boards: బీసీసీఐ ఆదాయం ఇన్ని కోట్లా… ఐసీసీ కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయా?
అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు అయిన వైభవ్ సూర్యవంశీ పై ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ని భారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారాతో పోల్చాడు. జోస్ బట్లర్ తాజాగా స్టువర్ట్ బ్రాడ్ తో కలిసి చేసిన ఓ పాడ్ కాస్ట్ లో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ ని ఎంతగానో మెచ్చుకున్నాడు.
ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ.. ” ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది ఐపీఎల్ లో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ. ఆ సమయంలో నేను గుజరాత్ కీపర్ గా వికెట్ల వెనకాల ఉన్నాను. వికెట్ల వెనుక నుండి అతడి బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతడి ఆటతీరు స్ఫూర్తిదాయకంగా ఉంది. నిజానికి సూర్యవంశి వయసులో నాకంటే సుమారు 20 సంవత్సరాలు చిన్నవాడు.
అలాంటి వ్యక్తి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతడు క్రీజ్ లోకి రాగానే తొలి బంతికే లాంగ్-ఆఫ్ మీదుగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అలాగే తన అరంగేట్ర మ్యాచ్ లో 20 బంతుల్లో 34 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. అతడు మైదానం నలుమూలలా కొడుతున్నాడు. అలాగే కేవలం సిక్సర్లు కొడుతున్నాడు. అవి భారీ సిక్సర్లు. వైభవ్ సాధారణ బౌలర్ల పైనే కాదు.. ప్రపంచంలోని అత్యుత్తమ టి-20 బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో కూడా అద్భుతమైన షాట్లు ఆడాడు.
ఇంతటి ప్రమాదకరమైన బౌలర్ల బౌలింగ్ లో సూర్యవంశీ తన ఇష్టం వచ్చినట్టు సిక్సర్లు బాధడం, సులభంగా పరుగులు రాబట్టడం చూసి వికెట్ల వెనకాల నేను ఆశ్చర్యపోయాను. అతడి టెక్నిక్, ఆత్మవిశ్వాసం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది” అని చెప్పుకొచ్చాడు బట్లర్. ఇక నూతన టెస్ట్ కెప్టెన్ గిల్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నైపుణ్యాలు కలిస్తే గిల్ అని పేర్కొన్నాడు. ఈ ఇద్దరు దిగ్గజాల నుంచి గిల్ ఎంతగానో నేర్చుకున్నాడని అన్నారు. నేటి నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో గిల్ అద్భుతంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">